E-Paper
Advertisement

Realme 13 Pro Extreme Edition: ఇచ్చిపడేశాడు బ్రో.. రియల్‌మి నుంచి మరో కొత్త ఫోన్.. 32MP ఫ్రంట్ కెమెరా, 5200mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో..!

Realme 13 Pro Extreme Edition: ఇచ్చిపడేశాడు బ్రో.. రియల్‌మి నుంచి మరో కొత్త ఫోన్.. 32MP ఫ్రంట్ కెమెరా, 5200mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో..!

Realme 13 Pro Extreme Edition Price: ఎప్పటి నుంచో పలు స్పెసిఫికేషన్లతో వార్తల్లో నిలుస్తున్న Realme 13 Pro Extreme Edition తాజాగా లాంచ్ అయింది. కంపెనీ ఈ ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో వచ్చింది. ఇందులో గరిష్టంగా 12GB RAMను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరాతో అమర్చబడింది. అలాగే బయోమెట్రిక్ కోసం ఇందులో ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ మొబైల్ గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. అలాగే వేగన్ లెదర్ ఫినిషింగ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే కంపెనీ Realme 13 Pro+ అండ్ Realme 13 Pro స్మార్ట్‌ఫోన్లను జూలైలో భారతదేశంలో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ మోడల్ సిరీస్‌లో కొత్తగా ప్రారంభించిన Realme 13 Pro ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌తో పాటుగా Realme 13 ప్రో+ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

Realme 13 Pro Extreme Edition Specifications

చైనాలో కొత్తగా లాంచ్ అయిన Realme 13 Pro Extreme Edition స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) OLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 2000nits పీక్ బ్రైట్‌నెస్, SGS AI ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో 12GB RAM + 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0తో ఫోన్ షిప్పింగ్ చేయబడింది.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడింది. అదే సమయంలో సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అందించబడింది. అంతేకాకుండా Realme 13 Pro ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్‌లో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీ అమర్చబడింది.

Also Read: అసలుసిసలైన ఫోన్.. వన్‌ప్లస్ నుంచి మరో సిరీస్.. డిజైన్, ఫీచర్లు కుమ్మేసాయ్..!

ఇక ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, GPS, NFC, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌తో పాటు SGS యాంటీ-డ్రాప్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఫోన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Realme 13 Pro Extreme Edition Price

Realme 13 Pro Extreme Edition ధర విషయానికొస్తే.. ఇందులో 12GB + 256GB ఆప్షన్ CNY 2,099 (సుమారు రూ. 24,700) నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో 12GB + 512GB వేరియంట్ CNY 2,399 (సుమారు రూ. 28,300) ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో Realme అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇది లేక్ గ్రీన్, మోనెట్ పర్పుల్ కలర్‌లలో అందించబడుతుంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×