Realme 14T Launch Date: రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రసవత్తరమైన పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తక్కువ ధరలో మంచి పనితీరును అందించే లక్ష్యంతో Realme మార్కెట్లోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 25, 2025న కొత్తగా విడుదల కానున్న Realme 14T ఫోన్‌తో మిడిల్ క్లాస్ విభాగాన్ని షేక్ చేయబోతోంది. ఇది టీ సిరీస్‌లో తొలి మోడల్ కావడం విశేషం. లాంచ్‌కు ముందే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అవుతూ, టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
డిస్‌ప్లే డిజైన్ మాయాజాలం
Realme 14T డిస్‌ప్లే విషయానికొస్తే, ఇది ఒక AMOLED ప్యానెల్ ద్వారా వస్తోంది. ఇందులో 2,100 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉంటుంది. అంటే బహిరంగంగా సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, 111% DCI-P3 కలర్ వల్ల రంగులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోలు చూసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు వావ్ అనిపించాల్సిందే. అదనంగా, ఇది సర్టిఫికేషన్ పొందిన స్క్రీన్ అంటే, నీలి కాంతి ఉద్గారాలను తగ్గించి, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డిస్‌ప్లే పరిమాణం ఇంకా అధికారికంగా వెల్లడి కాకపోయినా, లీక్‌ల ప్రకారం ఇది 6.6 అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్ కావొచ్చు.
బ్యాటరీ పవర్
ఈ ఫోన్ హైలైట్ ఏంటంటే, దాని 6,000mAh భారీ బ్యాటరీ. ఈ బ్యాటరీ బేస్ స్టేషన్‌లా పనిచేస్తుందని, నాన్‌స్టాప్ యూజ్‌కు సేఫ్ అంటున్నారు.
Realme తెలిపిన Usage మ్యాపు ప్రకారం:
-54.3 గంటల టాక్‌టైమ్
-17.2 గంటల YouTube వీక్షణం
-12.5 గంటల Instagram స్క్రోలింగ్
-12.5 గంటల గేమింగ్
-గుడ్‌న్యూస్ ఏంటంటే, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కొద్ది నిమిషాల్లో బ్యాటరీ మళ్లీ రెడీ అవుతుంది.
-పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా, ఈ ఫోన్ కేవలం 7.97mm స్లిమ్ గానే ఉంటుంది. హ్యాండీలోనూ, స్టైలిష్ లుక్‌లోనూ స్కోర్ కొడుతోంది.
Read Also: Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్.. …
నీటి నుంచి ప్రొటెక్షన్
సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో నీటి నిరోధకత అన్నది లభించదు. కానీ Realme 14T మాత్రం IP69 రేటింగ్ ద్వారా వస్తోంది. ఇది అత్యంత ప్రీమియం ఫీచర్. అంటే వర్షంలోనూ, పొడి ధూళిలోనూ ఈ ఫోన్ సేఫ్! పర్యాటకులు, అడ్వెంచర్ లవర్స్‌కి ఇది సూపర్ ఉపయోగపడుతుంది.
కెమెరా 50MP క్వాలిటీ
ఫోటో ప్రియుల కోసం Realme 14T ఒక 50MP ప్రధాన కెమెరాను అందించనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కానీ రెండో సెన్సార్ వివరాలు ఇంకా లీక్ కాలేదు. సెల్ఫీ కెమెరా వివరాలు వెల్లడికాకపోయినా, Realme ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు, సోషియల్ మీడియా ఫ్రెండ్లీ ఫొటోలు తీసుకోవచ్చు.
ప్రాసెసర్ – Dimensity 6300 Power
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ఉంటుంది. ఇది మధ్యశ్రేణి వర్గంలో మంచి పనితీరు ఇచ్చే ప్రాసెసర్. గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనుల్లో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే, ఇది Android 15 OS పై నడుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే మరింత కొత్త ఫీచర్లు, స్మార్ట్ ఇంటర్ ఫేస్ అందుబాటులోకి వస్తాయి.
RAM + స్టోరేజ్ ఆప్షన్లు
-Realme 14T రెండు వేరియంట్లలో రాబోతోంది:
-8GB RAM + 128GB స్టోరేజ్
-8GB RAM + 256GB స్టోరేజ్
-మీకు ఎంత స్టోరేజ్ కావాలో, దానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. పైగా, UFS స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. అంటే యాప్స్ వేగంగా ఓపెన్ అవుతాయి, ఫైల్ ట్రాన్స్‌ఫర్ స్మూత్‌గా ఉంటుంది.
ధర ఎంతంటే?
Realme 14T ప్రారంభ ధర రూ.17,999 గా ఉండనుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు సంబంధించినది. మరింత స్టోరేజ్ కావాలంటే, 256GB వేరియంట్ కూడా ఉండబోతుంది, దీని ధర రూ.19,999 గా ఉండొచ్చని ఊహిస్తున్నారు. అంతేకాదు, రూ.1,000 లాంచ్ డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.