E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో వారం రోజులు! రియల్‌మీ సరికొత్త ఇయర్‌బడ్స్ రివ్యూ!

సింగిల్ ఛార్జ్‌తో వారం రోజులు! రియల్‌మీ సరికొత్త ఇయర్‌బడ్స్ రివ్యూ!
Advertisement

Realme Buds T500 Pro: అదిరిపోయే ఫీచర్లతో.. ఒక క్రేజీ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే రియల్‌మీ నుంచి వచ్చిన Realme Buds T500 Pro మీ కోసమే. పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లోనే ఏకంగా 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ప్రీమియం LHDC 5.0 హై-రెస్ ఆడియో సపోర్ట్, ఏకంగా 56 గంటల అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్‌ని మోసుకొచ్చింది. ట్రెండీ లుక్‌తో.. పాటు నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉన్న ఈ బడ్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Realme Buds T500 Pro పూర్తి రివ్యూ:

రియల్‌మీ ఎప్పుడూ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇస్తూ మార్కెట్‌ను ఊపేస్తుంది. ఈ సారి కూడా ‘T500 Pro’తో బడ్జెట్ సెగ్మెంట్‌లో దుమ్మురేపడానికి వచ్చేసింది. లెమన్ కోలా, ఆరెంజ్ మింట్, చాక్లెట్ వంటి క్రేజీ అండ్ ట్రెండీ కలర్స్ ఆప్షన్లలో లభించే ఈ కేస్ పట్టుకోవడానికి చాలా ప్రీమియమ్‌గా, కంఫర్ట్ గా ఉంటుంది.

1. కంఫర్ట్ & డిజైన్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ చాలా లైట్‌వెయిట్. ప్రతి బడ్ బరువు కేవలం 4.5 గ్రాములు మాత్రమే. కాబట్టి చెవుల్లో.. పెట్టుకుంటే అస్సలు బరువున్నట్టే అనిపించదు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నా.. రన్నింగ్ చేస్తున్నా ఇవి చెవుల నుంచి అస్సలు జారిపడవు. వీటికి IP55 రేటింగ్ ఉండటం వల్ల చెమట, చిన్నపాటి నీటి చినుకులకు అస్సలు పాడవుతాయనే భయమే లేదు.

2.మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్:

ఇందులో 12.4mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్స్ వాడారు. పాటలు వినేటప్పుడు వచ్చే బేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రియల్‌మీ లింక్ యాప్ ద్వారా ‘డీప్ బాస్’, ‘క్లియర్ బాస్’ లాంటి డిఫరెంట్ ఈక్వలైజర్ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా పెద్ద హైలైట్ ఏంటంటే.. ఈ బడ్జెట్‌లోనే LHDC 5.0 హై-రెస్ ఆడియో , 360° స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల థియేటర్ లో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

3.50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్:

Advertisement

ఇందులోని AI బేస్డ్ 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా స్మార్ట్‌గా పని చేస్తుంది. చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ సౌండ్స్, ఫ్యాన్ లేదా ఏసీ శబ్దాలను ఇది చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది. ఆఫీస్ లో గానీ, జర్నీలో గానీ ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.

4.స్మార్ట్ ఫీచర్లు & గేమింగ్:

కనెక్టివిటీ కోసం లేటెస్ట్ Bluetooth 6.1 ఇచ్చారు. ఇందులో ‘ట్రిపుల్ డివైజ్ కనెక్టివిటీ’ ఉంది. అంటే ఒకేసారి మూడు డివైజ్‌లకు కనెక్ట్ చేసి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. గేమర్స్ కోసం ఇందులో 45ms లో-లేటెన్సీ గేమ్ మోడ్ ఉంది. కాబట్టి పబ్జీ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఆడియో లాగ్ అస్సలు ఉండదు. కాలింగ్ కోసం ఇచ్చిన 6-మైక్రోఫోన్ సెటప్ (AI ENC)వల్ల వాయిస్ కాల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. పైగా ఇందులో ఏఐ ఫేస్-టు-ఫేస్ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఉండటం విశేషం.

Also Read: అదిరిపోయే లుక్, సూపర్ ఫీచర్లతో.. మార్కెట్‌ను షేక్ చేస్తున్నస్మార్ట్ వాచ్

5. బ్యాటరీ లైఫ్:

ఛార్జింగ్ గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. కేస్‌తో కలిపి ఏకంగా 56 గంటల టోటల్ ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా 10 గంటల పాటు పాటలు వినొచ్చు.

రూ. 3,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం LHDC 5.0 ఆడియో, సూపర్ బ్యాటరీ, ఇంకా పవర్‌ఫుల్ ANC కావాలనుకుంటే Realme Buds T500 Pro ఒక బెస్ట్ అండ్ పర్‌ఫెక్ట్ ఛాయిస్.

Realme Buds T500 Pro ధర:

లాంచ్ ధర: రూ.2,799 (కార్డ్ ఆఫర్లు, సేల్స్ సమయంలో ఇది ఆన్‌లైన్ లో రూ.2,599 కే లభిస్తోంది).

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×