Abhishek Sharma Black Magic: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న టి20 సిరీస్ (India tour of England, 2026 )ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య నిన్న మొదటి మ్యాచ్ రాత్రి పది గంటలకు ప్రారంభమైంది. అయితే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసేంతవరకు పడని వర్షం.. ఇంగ్లాండు బ్యాటింగ్ కు దిగే సమయంలో షురూ అయింది. వర్షం ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో, మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా నిన్న అర్థ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ (Abhishek Sharma ), క్షుద్ర పూజలు (Black Magic ) చేసినట్లు సోషల్ మీడియాలో కొంతమంది దారుణంగా పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ కు దిగే ముందు మైదాన్యానికి సంబంధించిన మట్టిని తీసుకొని, అభిషేక్ శర్మ ( Abhishek Sharma Black Magic) పూజలు చేశాడని.. అందుకే అర్థ సెంచరీ చేసినట్లు సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు ఆ వీడియోను వైరల్ చేసి రచ్చ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన టీమిండియా, 189 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇందులో అభిషేక్ శర్మ 24 బంతుల్లోనే 59 పరుగులు చేసి రెచ్చిపోయాడు. అలాగే నాలుగు సిక్సర్లు, ఆరు బౌండరీలు బాదేశాడు అభిషేక్ శర్మ. 245 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు. దీంతో అభిషేక్ శర్మ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదంతా పక్కకు పెడితే.. ప్రతి మ్యాచ్ ఆరంభంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు దిగేముందు ఏకాగ్రత కోసం ప్రత్యేకంగా సాధన చేస్తాడు. బంతితో అభిషేక్ శర్మ సాధన చేసి బ్యాటింగ్ కు దిగుతాడు.
మొదటి నుంచి అభిషేక్ శర్మ ఇలాగే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నటి మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు అభిషేక్ శర్మ కాస్త వింతగా అప్రవర్తించాడు. మైదానంలో ఉన్న మట్టిని తీసుకొని.. ప్రత్యేకంగా పూజ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇంగ్లీష్ క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మ్యాచ్ కంటే ముందు బ్లాక్ మ్యాజిక్ చేశాడని అభిషేక్ శర్మ పై ఆరోపణలు చేస్తున్నారు. అందుకే అర్థ సెంచరీ నమోదు చేశాడని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై విచారణ జరగాల్సిందేనని మరి కొంత మంది పోస్టులు పెడుతున్నారు.
Vaibhav Sooryavanshi what a character 🤣🤣🤣
– Abhishek Sharma was doing his pre batting focus practice by focusing on ball and knocking the ball on bat .
– then Vaibhav Sooryavanshi came stand in front of Abhishek and passed some joke and Abhishek lose his concentration 😭🤣… pic.twitter.com/S74NvlkBQn
— Jeet (@JeetN25) July 2, 2026