Antarctica Waterfall: ప్రపంచంలో అత్యంత చల్లని ఖండం అంటార్కిటికా. ఆ ప్రాంతం నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎటు చూసినా మంచు, ఇంకాస్త లోతుల్లో వెళ్తే జలజల పారే సెలయేర్లు. అక్కడ ఓ జలపాతం ఎర్రగా ప్రవహిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.. ఆపై ఆశ్చర్యపరుస్తోంది కూడా. శతాబ్దంగా వేధించిన ఈ రహస్యానికి శాస్త్రవేత్తలకు సమాధానం దొరికింది.
అంటార్కిటికాలో రెడ్ జలపాతం..
అంటార్కిటికాలోని ఓ జలపాతంపై ఎర్రగా ఏదో చిమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఆ భయానక రూపం ఆ ఎర్రటి ధార అస్సలు రక్తం కాదు. ఆ ఖండంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. దాన్ని బ్లడ్ ఫాల్స్ పిలుస్తారు. ఎరుపు రంగుకు అసలు కారణం ఇనుము అధికంగా వున్న అత్యంత ఉప్పునీరు.
మంచు అడుగున ఈ నీరు బయటకు వచ్చిన వెంటనే గాలిలోని ఆక్సిజన్‌తో ప్రతి చర్య జరుపుతుంది. ఫలితంగా ఈ రంగులోకి మారుతుంది. అందుకే ఆ జలపాతం ఎర్రగా రక్త ప్రవాహం మాదిరిగా కనిపిస్తుంది. బ్లడ్ ఫాల్స్ మూలం టేలర్ హిమానీనదం కింద సుమారు 400 మీటర్ల లోతులో పురాతన భూగర్భ సరస్సు ఉంది. సుమారు 15 లక్షల ఏళ్ల కిందట సముద్రపు నీరు మంచు కింద చిక్కుకుపోయింది.
ఈ మిస్టరీ గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు
కాల క్రమేణా మరింత ఉప్పుగా మారినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో ఈ నీరు గడ్డ కట్టకుండా ద్రవరూపంలో ఉంటుంది. 1911లో ఆస్ట్రేలియా భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ ఈ తరహా జలపాతాన్ని మొదటిసారి గుర్తించారు. ఎరుపు రంగుకు శైవలాలు కారణమని ఆయన నమ్మారు. తర్వాత అధ్యయనాలు అందుకు విరుద్ధంగా రావడంతో ఇనుము అధికంగా ఉన్న ఉప్పునీటి దీనికి కారణమని వెల్లడించాయి.
2017లో అలాస్కా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాడార్ సాయంతో గ్లేసియర్‌లోని రహస్య మార్గాలను గుర్తించారు. ఉప్పు నీరు ఆ మార్గాల గుండా పైకి వచ్చి రెడ్ వాటర్ ఫాల్స్‌గా బయటపడుతుందన్నారు. మరో కీలక విషయాన్ని బయటపెట్టింది అంటార్కిటిక్ సైన్స్ జర్నల్. గ్లేసియర్‌లో ఏర్పడే చిన్న పగుళ్ల ద్వారా అప్పుడప్పుడు ఉప్పునీరు బయటకు వస్తోందని గుర్తించారు శాస్త్రవేత్తలు.
ALSO READ: పాక్‌లో చొరబడి ఐసిస్ నెట్‌వర్క్‌పై అఫ్గాన్ మెరుపు దాడులు.. అసలు కారణం ఇదే!
ఫలితంగా ఎర్రటి జలపాతం వెనుక ప్రకృతి రహస్యానికి స్పష్టత లభించింది. మరో విషయం ఏంటంటే.. ఉప్పునీటిలో సూర్యకాంతి, ఆక్సిజన్ లేకుండా లక్షల ఏళ్లుగా సూక్ష్మజీవులు సమూహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కిరణజన్య సంయోగక్రియపై ఆధారపడకుండా సూక్ష్మజీవులు సల్ఫేట్‌తో కూడిన రసాయన చర్యలను ఉపయోగించి జీవించడం ఆశ్చర్యపరుస్తోంది.
Nature is awesome.
"Blood Falls" in Antarctica. pic.twitter.com/Us9BXO4jBY
— Fascinating History (@Fascinate_Hist) December 22, 2025