BigTV English

Paris Olympics 2024: సిల్వర్ మెడల్ వినేష్ ఫోగట్‌‌కు ఇవ్వడంపై యూడబ్ల్యూడబ్ల్యూ చీఫ్ క్లారిటీ

Paris Olympics 2024: సిల్వర్ మెడల్ వినేష్ ఫోగట్‌‌కు ఇవ్వడంపై యూడబ్ల్యూడబ్ల్యూ చీఫ్ క్లారిటీ

UWW Chief Clarity on Awarding Silver Medal to Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌‌కు అనర్హత వేటు పడింది. దీంతో రజత పతకం ఇవ్వడం అస్సలు కుదురదని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ నెనాద్ లాలోవిచ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వినేష్ ఫోగట్ ఒక్కరి కోసం రూల్స్‌ను మార్చలేమని స్పష్టం చేశారు చీఫ్. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్ రజత పతకం ఖాయం చేసింది. దాదాపు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో డిస్‌ క్వాలిఫై చేసిన విషయం విధితమే. అయితే ఈ వ్యవహారం కాస్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా షాక్ అయ్యారు. వినేష్ ఫోగట్ అనర్హత వేటు వెనుక భారీ కుట్ర ఉందనే ప్రచారం కూడా దేశమంతటా జరుగుతోంది. ఫైనల్‌కి చేరిన వినేష్ ఫోగట్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘం, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించగా, ఇప్పటికే ఆమె వాదనలు అంతటితో ముగిశాయి.


అయితే ఆమె వాదనలను ఆగస్ట్ 13నాటికి ఫైనల్ తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు నెనాద్ లాలోవిచ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. వినేష్ ఫోగట్‌‌కు గతేడాదిన్నరగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ విషయంలో ఆమెపై నేను జాలిపడగలను. అంతేకానీ ఆమెకు ఎలాంటి సాయం చేయలేను. ఎందుకంటే నిబంధనలు అనేవి అందరికి సమానమే. ఒకరి కోసం వాటిని మనం మార్చలేమని స్పష్టం చేశారు.క్రీడలు అనేవి కొన్ని కండీషన్స్ ప్రకారమే జరుగుతుంటాయి. అంతేకాని వాటిని ఎవరు కూడా మార్చలేరంటూ ఐఓఏ చెప్పింది. యూరప్‌కు చెందిన నేను భారత్‌కు వచ్చినప్పుడు అక్కడి నియమాలనే ఇక్కడ కూడా నేను పాటించాలని తెలిపారు. అలాకాకుండా యూరప్ రూల్స్‌ను భారత్‌లో పాటిస్తే సమస్యలు ఏర్పడుతాయని తెలిపారు. క్రీడల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, అందరికీ ఒకే రూల్ ఉంటుంది.

Also Read: వినేశ్ విషయంలో.. న్యాయం గెలుస్తుందా?


యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం… గాయపడిన ఆటగాళ్లకు పతకం ఇవ్వవచ్చు, కానీ వినేష్ ఫోగట్ గాయాలయ్యాయా… ఆమెకు గాయమైనట్లు చెబితే వైద్య బృందంతో చెక్ చేయించేవాళ్లం కదా అంటూ తెలిపింది. ఈ ఒలింపిక్స్‌లో ఓ ఆటగాడు అధిక బరువు కారణంగా.. బరువు పరీక్షకు హాజరు కాలేకపోయాడు. దాంతో అతనిపై గట్టిగానే వేటు పడింది. కాబట్టి వినేష్ ఫోగట్ ఒక్కరి కోసం రూల్స్‌ను మార్చలేమంటూ స్పష్టం చేశారు. మొదటి రోజు మాత్రమే బరువును కొలిచి, రెండో రోజు ఆటకు అనుమతించాలని చెబుతున్నారు కదా. మొదటి రోజు తర్వాత ఐదు కిలోల బరువు పెరిగి రెండో రోజు ఆడితే, ఆటలో సమతుల్యత ఉండదు కదా. రెజ్లింగ్ అనేది బరువుకు సంబంధించిన పోటీ. కాబట్టి ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇవ్వడం కుదురదంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ట్రిబ్యూనల్‌లో సవాల్ చేసామని, వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం దానిని అమలు చేస్తామని నెనాద్ లాలోవిచ్ స్పష్టం చేశారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×