Big Stories

Russians Mets Chiranjeevi in Hyderabad: మెగాస్టార్‌ను కలిసిన రష్యన్ ప్రతినిధులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Russians Mets Chiranjeevi in Hyderabad on Film Industry Issues: మెగాస్టార్‌ చిరంజీవి రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్​లోని చిరంజీవి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తాము అందించే సహకారంపై రష్యా బృందం చిరంజీవితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో పాటు మరిన్ని అంశాలపై వారితో చిరంజీవి మాట్లాడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

రష్యాలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేయడానికి రష్యన్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు జులియా గోలుబెవా, ఎకటెరినా జాడే చిరంజీవికి వివరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ఆయనతో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Also Read: Mahesh Babu SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి అలా నడిసొస్తుంటే ఉంది మావా.. వీడియో వైరల్

మెగాస్టార్‌ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్‌కోవ్‌స్కాయా ఉన్నారు. మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన అంశాల పట్ల హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణలో రష్యాకు తగిన ప్రాధాన్యత ఉండేలా తెలుగు సినీ పరిశ్రమ తరపున చిరంజీవి వారికి హామీ ఇచ్చారు.

భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కాగా.. బింబిసార డైరెక్టర్‌ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. జనవరి 10, 2025న సంక్రాంతి కానుకగా  మూవీ విడుదల కానుంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News