Rajinikanth Comments on Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కూలీ’. హిట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, సాంగ్స్ మూవీ మంచి బజ్ క్రియేట్ చేశాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రుతి హాసన్, పూజా హెగ్డేలు సైతం ఈ చిత్రంలో భాగం అయ్యారు.
రజనీ కూడా కమల్ పరిస్థితేనా..
మొదటి నుంచి ఈ సినిమా మంచి బజ్ నెలకొంది. విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార పోస్టర్స్, లీకైన వీడియోలు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో కూలీ మూవీతో రజనీకి మరో బిగ్గెస్ట్ హిట్ పడబోతుందని, పక్కా పైసా వసూల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ అంతా ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా దర్శకుడు లోకేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. చూస్తుంటే రజనీకి కూడా కమల్ పరిస్థితే వచ్చేలా ఉందే అని అంతా సందేహిస్తున్నారు.
కూలీ మూవీపై రజనీ రియాక్షన్
కాగా ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూలీ మూవీకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఇటీవల ఈ సినిమాను రజనీసర్ చూపించానని, సినిమా చూసిన ఆయన తనని హగ్ చేసుకున్నారని చెప్పారు. అనంతరం ‘ సినిమా తనకు తలపతి చిత్రాన్ని గుర్తు చేసింది’ అని ప్రశంసించారని లోకేష్ చెప్పాడు. అయితే ఇవే మాటలను ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెడుతున్నారు. ఎందుకంటే ఇటీవల థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ టైంలోనే కమల్ సరిగ్గా ఇలాంటి కామెంట్సే చేశారు. థగ్ లైఫ్ రిలీజ్ కు ముందు ఈ సినిమా నాయకన్ చిత్రాన్ని మర్చిపోయేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అత్యుత్సాహం వద్దు..
కానీ, రిలీజ్ తర్వాత అంచనాలన్ని తారుమారయ్యాయి. థగ్ లైఫ్ ఘోర పరాజయం పొందింది. థియేటర్ లోనే కాదు ఓటీటీలోను ఈ సినిమా మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడు కూలీపై సైతం అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం చూసి రజనీ.. తలపతిని గుర్తు చేసుకున్నారు. అంటే థగ్ లైఫ్ లాగే కూలీ కూడా డిసప్పాయింట్ చేస్తుందా? అని అభిమానులు సందేహిస్తున్నారు. అందుకే మూవీ టీం ప్రమోషన్స్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, విడుదలకు ముందే భావోద్వేగభరితమైన కామెంట్స్, అతిశయోక్తి వంటి ప్రకటనలు చేయొద్దని కోరుతున్నారు. ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల మూవీపై అంచాలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు అనవసరమైన ఒత్తిడి గురవ్వాల్సి వస్తోందని భావిస్తున్నారు.
Also Read: ‘కూలి’ మూవీపై రజనీకాంత్ అలాంటి కామెంట్స్.. ఫ్యాన్సులో కలవరం, అంటే కమల్ పరిస్థితేనా?