Kothappallylo okkappudu : మనోజ్ చంద్ర, (Manoj Chandra)మోనికా(Mounika) ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “కొత్తపల్లిలో ఒకప్పుడు “. (Kothappallylo okkappudu)రానా దగ్గుబాటి, (Rana Daggubati)స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా అద్భుతమైన కామెడీ నేపథ్యంలో రాబోతుందని తెలుస్తుంది. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాల ద్వారా ప్రశంసలు పొందిన సినిమాలతో అనుబంధం కలిగిన నటి చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి(Praveena Parachuri) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పరుచూరి విజయ ప్రవీణ్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా ఈనెల 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఓటీటీ డీల్ పూర్తి
ఈ ట్రైలర్ ఊహించని ట్విస్ట్ లతో.. నాన్ స్టాప్ కామెడితో ఆకట్టుకుంది. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమా మంచి ఆదరణ పొందుతుందని తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమా విడుదలవుతుంది అంటేనే విడుదలకు ముందే ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha) కైవసం చేసుకున్నట్టు సమాచారం.
గ్రామీణ నేపథ్యంలో..
ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి డీల్ పూర్తి అయిందని, ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు ఆహాలో విడుదల కాబోతుందని సమాచారం. ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా అయినా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఓటీటీ హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయి, ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు విడుదల కాబోతుందనే విషయాల గురించి ఆహా అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కిందని తెలుస్తోంది.
నటీనటుల విషయానికి వస్తే…
ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. మనోజ్ చంద్ర, ఉషా బోనే, మోనిక ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో బెనర్జీ, బొంగు సత్తి, ప్రేమ్ సాగర్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కనుక చూస్తుంటే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది . ఇక సినిమాపై అంచనాలు పెంచుతూ చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రానా సమర్పణలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా కంచరపాలెం సినిమాను పోలి ఉంటుందని ఇటీవల దర్శకురాలు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Fashion Show: లఖోటియా కాలేజ్ ఆధ్వర్యంలో “ట్రాషిక్ – ది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్” ఫ్యాషన్ షో