BigTV English
Advertisement

Offers oRealme Narzo 70 Pro 5G: 5జీ ఫోన్ కొంటే కాస్ట్‌లీ ఇయర్ బడ్స్ ఫ్రీ.. అదనంగా భారీ డిస్కౌంట్ కూడా..!

Offers oRealme Narzo 70 Pro 5G: 5జీ ఫోన్ కొంటే కాస్ట్‌లీ ఇయర్ బడ్స్ ఫ్రీ.. అదనంగా భారీ డిస్కౌంట్ కూడా..!
Realme Narzo 70 Pro 5G
Realme Narzo 70 Pro 5G

Get Rs. 2300 Bluetooth ear Buds free on buying Realme Narzo 70 Pro 5G: రియల్ మీ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి బడ్జెట్ ఫోన్లు, ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో మోడళ్లు మార్కెట్‌లోకి వచ్చి అందరినీ అట్రాక్ట్ చేశాయి.


ఇందులో భాగంగా గతేడాది లాంచ్ ఈ కంపెనీ నుంచి లాంచ్ అయిన నార్మో 60 ప్రో మొబైల్‌కి మంచి స్పందన వచ్చింది. దీంతో రియల్‌ మీ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ‘రియల్ మి నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G)’ని భారత్‌లో విడుదల చేసింది. కాగా కంపెనీ దీనిని ‘మోస్ట్ ప్రీమియం నార్జో’ స్మార్ట్‌ఫోన్‌గా తెలిపింది.

ఈ మొబైల్ 120 హెచ్ జెడ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమరా సిస్టమ్, మీడియా‌టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని అద్భుతమైన లక్షణాలలో ముఖ్యమైనది సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా. ఈ ఫీచర్ కలిగిన కెమెరా ఇండియాలో ఈ సెగ్మెంట్లలో మొట్టమొదటిదని కంపెనీ పేర్కొంది.


Also Read: అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీమియర్ లీగ్ సేల్.. రూ.11వేల లోపు టాప్ 5G మొబైల్స్ ఇవే..!

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:

రియల్ మి నార్జో 70 ప్రో 5జీ మొబైల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల పంచ్-హోల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 100 శాతం P3 కలర్ గామట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 8 జీబీ వర్చువల్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీని ఇందులో అమర్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది 50MP సోనీ IMX890 ప్రధాన లెన్స్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది OISకి మద్దతు ఇస్తుంది. 2x ఇన్-సెన్సర్ జూమ్‌ను కలిగి ఉంది. అలాగే 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది.

Also Read: 5జీ ఫోన్‌పై రూ.41 వేల భారీ డిస్కౌంట్.. ఇప్పుడు రూ.3,999లకే కొనుక్కోవచ్చు..

అంతేకాకుండా ఇది 16MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. అలాగే ఇది మాస్టర్ షాట్ అల్గారిథమ్ ఫీచర్లను కూడా సపోర్ట్ చేయగలదు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మి యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పనిచేస్తుంది.

అంతేకాకుండా 10కి పైగా ఎయిర్ గెస్చర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌తో.. ఫోన్‌ను టచ్ చేయకుండానే.. ఫోన్ స్క్రీన్‌పై చేతిని అటు ఇటు కదిలించడం ద్వారా ఆపరేట్ చేసే సౌలభ్యం ఉంది. ఇది 67W SuperVOOC ఛార్జ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ధర:

రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ మొబైల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే దీని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో కొనుక్కోవచ్చు.

Also Read: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు!

ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు, ఈఎంఐ ట్రాన్షక్షన్లపై రూ.2000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా రూ.2299 విలువైన రియల్‌ మి బడ్స్‌ టీ 300 ను ఉచితంగా పొందొచ్చు. కాగా ఇది గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Tags

Related News

Amazon Bumper offer: మ్యూజిక్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఇదే సరైన సమయం

Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్‌ బ్లాస్టర్ ఫోన్

Redmi Note 15: రూ.12,000లకే ఫ్లాగ్‌షిప్ లుక్‌.. రెడ్మీ నోట్ 15 ఫోన్‌ సూపర్ ఫీచర్లు తెలుసా..

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Big Stories

×