BigTV English

Ram Charan Tweet on Anand Mahindra: ‘సుజీత్ పెళ్లికి నన్నేందుకు ఇన్వైట్ చేయలేదు..?’ మహీంద్రా యాడ్ పై రామ్‌చరణ్ ట్వీట్

Ram Charan Tweet on Anand Mahindra: ‘సుజీత్ పెళ్లికి నన్నేందుకు ఇన్వైట్ చేయలేదు..?’ మహీంద్రా యాడ్ పై రామ్‌చరణ్ ట్వీట్
RamCharan about Aanandh Mahindhra Add
RamCharan about Aanandh Mahindhra Add

Actor RamCharan Tweet on Aanandh Mahindhra Ad: టాలీవుడ్ యంగ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఊహించలేనంత క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న చెర్రీకి.. భార్యతో కలిసి చేస్తున్న వీడియోలకు కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. తన భార్య కొణిదెల ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ఇటీవల కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.


ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హీరో రామ్ చరణ్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. తమ కంపెనీ ప్రమోషన్లలో భాగంగా మహీంద్రా కంపెనీ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోపై రామ్ చరణ్ స్పందించాడు.

ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే 2040 సంవత్సరం నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారడమే తమ లక్ష్యం అంటూ మహీంద్రా సంస్థ ఓ యాడ్ ను తయారు చేసి విడుదల చేసింది. ఈ యాడ్ లో కొన్నేళ్ల క్రితం తెలంగాణలోని జహీరాబాద్ లో మహీంద్రా ఫ్యాక్టరీని నిర్మించడమే కాకుండా లక్షలాది చెట్లను సంస్థ నాటిందని పేర్కొన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా అక్కడ నిర్మించినట్లు వీడియోలో చెప్పారు. దీని వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ లెవల్ అనేది దాదాపు 400 అడుగుల వరకు పెరిగిందని.. దీంతో ఆ ఊరులో బ్రహ్మచారిగా ఉన్న సుజిత్ కు పెళ్లి కూడా ఫిక్స్ అయిందని వీడియోలో చూపించారు. ఇక ఈ వీడియో చూసిన చెర్రీ ప్రశంసలు కురిపించారు.


Also Read: Game Changer: జరగండి.. జరగండి.. గ్లోబల్ స్టార్ వచ్చే సమయం ఆసన్నమైంది

వీడియోపై స్పందించిన చెర్రీ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘సుజిత్ వివాహానికి నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు ? ఆనంద్ మహీంద్రా జీ’ నేను జహీరాబాద్ దగ్గర్లోనే ఉంటాను. ఆ ప్రాంతంలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరాదాగా వారిని కలిసేవాడిని. ఇక ఏది ఏమైనా గ్రేట్ వర్క్’ అని పేర్కొన్నారు. రామ్ చరణ్ ట్వీట్ పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘గందరగోళంలో పడి ఆహ్వానించడం మర్చిపోయా. మీ ట్రైనింగ్ ఆధారంగా నా డ్యాన్స్‌ను చాలా పర్ఫెక్ట్ చేసుకున్నా. మా యాడ్స్ పై రియాక్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్. నేను మళ్లీ మిస్ అవ్వాలని అనుకోవట్లేదు. అందుకే ఇప్పుడే చెబుతున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే’ అని మహీంద్రా రిప్లై ఇచ్చారు.

Tags

Related News

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Big Stories

×