BigTV English
Advertisement

Realme Narzo 70 Turbo: గేమింగ్ ఫోకస్డ్ ఫోన్.. వదులుకున్నారంటే, మళ్లీ రాదు బ్రో!

Realme Narzo 70 Turbo: గేమింగ్ ఫోకస్డ్ ఫోన్.. వదులుకున్నారంటే, మళ్లీ రాదు బ్రో!

Realme Narzo 70 Turbo: ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ మయమైపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఒక వ్యసనంగా మారిపోయింది. అందువల్లనే మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కొత్త కొత్త కంపెనీలు దర్శనమిస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో మార్కెలో‌ కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల స్మార్ట్‌ఫోన్లు వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. అందులో ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి ఒకటి.


అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైళ్లను లాంచ్ చేస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా సామాన్యులే లక్ష్యంగా కంపెనీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరొక కొత్త ఫోన్‌ను మార్కెట్‌లో దించేందుకు రంగం సిద్ధం చేసింది. త్వరలో అంటే సెప్టెంబరు 9, 2024న భారతీయ మార్కెట్లోకి తన లైనప్‌లో ఉన్న Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఇది టర్బో ప్రత్యయంతో నార్జో సిరీస్‌లోని మొదటి మొబైల్‌గా చెప్పబడుతుంది. అ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పబడింది. అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.


Realme Narzo 70 Turbo design and specifications

Also Read: మ మ మాస్ ఫోన్ లాంచ్.. పేరు కొత్తదైతేనేమ్, ఫీచర్లు మాత్రం పిచ్చెక్కించాయ్!

Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ ఎల్లో అండ్ బ్లాక్ ప్యానెల్‌తో మోటార్‌స్పోర్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగం మధ్యలో ఎల్లో కలర్‌లో ఉండి, రెండు వైపుల నుండి నల్లటి చారలు ఉన్నాయి. వెనుకవైపు, మొబైల్ మూడు సెన్సార్లు, LED ఫ్లాష్‌తో సహా రౌండ్ టైప్ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో స్మార్ట్‌ఫోన్‌లో పంచ్-హోల్ డిస్‌ప్లే ఉందని చెప్పబడింది. ఈ Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ చాలా సన్నగా.. 7.6 మిమీ వద్ద కనిపిస్తుంది. ఈ మొబైల్ గేమింగ్ ఎక్సలెన్స్‌తో Realme టీజర్‌లో కూడా ఆవిష్కరించింది.

ఇది కాకుండా ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్-సెంట్రిక్ ఫీచర్‌లను కూడా చూసే వీలున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. Realme Narzo 70 Turbo 5G ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌ను ప్యాక్ చేస్తుంది. Realme ద్వారా క్లెయిమ్ చేయబడిన ఈ చిప్‌సెట్ దాని విభాగంలో అత్యంత వేగవంతమైనదిగా గుర్తింపు పొందింది. ఇంకా AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో Narzo 70 Turbo మొబైల్ 750,000 స్కోర్ చేసిందని Realme పేర్కొంది. అయితే గతంలో వచ్చిన లీక్‌లు స్మార్ట్‌ఫోన్‌లో నాలుగు స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయని సూచించాయి.

అందులో 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది EISతో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP ఫ్రంట్ సెన్సార్‌ను కూడా పొందవచ్చని చెప్పబడింది. అయితే ఇప్పటి వరకు Realme అధికారికంగా పరిమిత సమాచారాన్ని మాత్రమే వెల్లడించింది. త్వరలో మరింత సమాచారం అఫీషియల్‌గా రానుంది.

Related News

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

iphones Stolen: ఒకే నగరంలో 80000 ఐఫోన్లు దొంగతనం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Oneplus Nord 2T Ultra 5G: వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ అల్ట్రా 5జీ.. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

AI Hospital Bill Error: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

Big Stories

×