BigTV English
Advertisement

JP Nadda comments on kcr 2bhk: కేసీఆర్ బాటలో సీఎం రేవంత్, ఆ బాధ్యత మేం తీసుకుంటాం

JP Nadda comments on kcr 2bhk: కేసీఆర్ బాటలో సీఎం రేవంత్, ఆ బాధ్యత మేం తీసుకుంటాం

JP Nadda comments on KCR(Latest political news telangana): కేసీఆర్ బాటలోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. డబుల్ బెడ్ రూమ్‌ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. కేంద్ర అందించిన పీఎంజేవై స్కీమ్‌ను నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఉపయోగించుకోలేదన్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే సీఎం రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని దుయ్యబట్టారు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార‌సభకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ను ఈసారి ఎన్నికల్లో తప్పకుండా గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని తమ పార్టీ పూర్తి చేస్తుందన్నారు. పనిలోపనిగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. రానున్న రోజుల్లో భారత్.. ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా మారుతుందన్నారు.

ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం సెకండ్ ప్లేస్‌లో ఉందని గుర్తు చేశారు జేపీ నడ్డా. మేకిన్ ఇండియా వల్ల ఇక్కడ తయారైన మొబైల్ ఫోన్లను మనమే వినియోగిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమన్నారు. దేశంంలో ఇప్పటివరకు 56వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని, రైల్వే లైన్లను విద్యుదీకరణ పూర్తి కావస్తుందన్నారు. అలాగే ఎయిర్‌పోర్టుల సంఖ్య యూపీఏ హయాంలో కంటే రెట్టింపు చేశామన్నారు. ముఖ్యంగా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించిన ఘటన మోదీ సర్కార్‌కే దక్కుతుందన్నారు.


Tags

Related News

Supreme Court: రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు లో విచారణ.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Bandi Sanjay: గ్రేట్.. 4,847 మంది విద్యార్థులకు అండగా నిలిచిన బండి సంజయ్.

Brs Jubilee Hills: అదే ఓవర్ కాన్ఫిడెన్స్.. బీఆర్ఎస్ లో ఏ మార్పు లేదు

Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. భయాందోళనలో ప్రయాణికులు

Ande Sri: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ

Kcr Campaign: జూబ్లీహిల్స్ ప్రచార బరిలో కేసీఆర్.. చివరకు అలా ముగించారు

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: ఎన్నికల అధికారి కర్ణన్

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Big Stories

×