E-Paper
Advertisement

రియల్‌మీ టీవీపై భారీగా డిస్కౌంట్..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు

రియల్‌మీ టీవీపై భారీగా డిస్కౌంట్..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు
Advertisement

Realme TechLife 43 inch Google TV: ఇంటికి సరి కొత్త లుక్ తీసుకొస్తూ, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి స్మార్ట్ టీవీలు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో బ్రాండ్లలో రియల్‌మీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ఫీచర్లతో వచ్చిందే ‘రియల్‌మీ టెక్‌లైఫ్ 108 సెంమీ (43 ఇంచ్) ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ’. ముఖ్యంగా హాల్ లేదా బెడ్‌రూమ్‌కు సరిగ్గా సరి పోయే 43 ఇంచ్ స్క్రీన్ సైజ్ చాలా మంది బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది స్టైలిష్ లుక్, బడ్జెట్ ధర కారణంగా ఇది టెక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ టెక్‌లైఫ్ 108 సెంమీ టీవీ ఫీచర్లు:

1. అద్భుతమైన డిస్‌ప్లే, క్వాలిటీ:

ఈ టీవీ స్పెషల్ అట్రాక్షన్ దాని స్క్రీన్ క్వాలిటీ. 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తున్న ఈ టీవీలో.. రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. మెరుగైన పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉండటం వల్ల వీడియోలు చూసేటప్పుడు విజువల్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. కుటుంబంతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారికి ఇది మంచి థియేటర్ అనుభూతిని అందిస్తుంది. పగటిపూట అయినా, రాత్రి అయినా స్క్రీన్ బ్రైట్‌నెస్ కళ్లకు ఇబ్బంది కలిగించదు.

2. సౌండ్, స్పీకర్ అవుట్‌పుట్:

Advertisement

కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా ఆడియో విషయంలోనూ.. ఈ రియల్‌మీ టీవీ అదరగొడుతుంది. ఇందులో.. అందించిన స్పీకర్లు క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ను అందిస్తాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల మ్యూజిక్, డైలాగ్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అదనపు హోమ్ థియేటర్ సిస్టమ్ అవసరం లేకుండానే ఇంట్లోనే చిన్నపాటి సినిమా హాల్ ఫీల్ ఇది పంచుతుంది.

3. గూగుల్ టీవీ ఓఎస్, స్మార్ట్ ఫీచర్లు:

ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని వల్ల ఇంటర్‌ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఒకే చోట ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం మీ గొంతుతోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు. అలాగే క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ సపోర్ట్ ద్వారా మీ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: టెక్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్..మార్కెట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 గోబోల్ట్ వాచ్‌లు!

4. ధర:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ టీవీని మార్కెట్లో విడుదల చేశారు. అన్ని ట్రెండీ ఫీచర్లతో వస్తున్న.. ఈ రియల్‌మీ టెక్‌లైఫ్ 43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ టీవీ ధర సుమారు రూ.19,299కే లభిస్తుంది. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు లభించడం నిజంగా గొప్ప విషయమని చెప్పవచ్చు. అంతే కాకుండా దీనిలోని ఫీచర్ల వల్ల ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో కూడా ఉంది. డిస్కౌంట్ లో ఈ టీవీ ఇంకా తక్కువ ధరకే వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×