E-Paper
Advertisement

స్మూత్ డిస్‌ప్లే, కిరాక్ లుక్.. ఆండ్రాయిడ్ 16తో Moto G Max 5G భారత్‌లోకి వచ్చేసింది!

స్మూత్ డిస్‌ప్లే, కిరాక్ లుక్.. ఆండ్రాయిడ్ 16తో Moto G Max 5G భారత్‌లోకి వచ్చేసింది!
Advertisement

Moto G Max 5G: ఫోన్ కొనేటప్పుడు కెమెరా, డిజైన్ మాత్రమే చూసే రోజులు పోయాయి. ఇప్పుడు బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? ఫోన్ ఎంత గట్టిగా ఉంటుంది? రోజువారీ వాడకంలో పనితీరు ఎంత మెరుగ్గా ఉంటుంది? అనే విషయాలకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజు రోజుకూ మారుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోటరోలా తీసుకొచ్చిన కొత్త ఫోనే Moto G Max. భారీ బ్యాటరీ నుంచి డ్యూరబుల్ డిజైన్ వరకు.. కేవలం స్పెసిఫికేషన్లకే పరిమితం కాకుండా.. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకున్న ఫోన్‌గా ఇది ఆసక్తి రేపుతోంది.

భారత్‌లో ఈ Moto G Max 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.27,999 గా నిర్ణయించారు. ప్యాంటోన్ అలాస్కాన్ బ్లూ, మాలాగా, స్టార్‌గేజర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. ఆగస్టు 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రముఖ బ్యాంక్ కార్డులపై రూ.1,000 తక్షణ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: భారీ డిస్‌ప్లేతో Xiaomi Mix Fold 5.. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?

Moto G Max 5Gలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 7000mAh భారీ బ్యాటరీ గురించి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 63 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. వేగంగా ఛార్జ్ చేయడానికి 30W టర్బోపవర్ సపోర్ట్ ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. దీనిలో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్ అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు.

Advertisement

ఈ Moto G Max 5G ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా స్టోరేజ్‌ను ర్యామ్‌లా వాడుకునే వెసులుబాటు ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హెల్లో UIతో వస్తున్న ఈ ఫోన్‌కు రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తామని మోటరోలా హామీ ఇచ్చింది.

ఇక ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP సోనీ లిటియా 600 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి చుక్కల నుండి తట్టుకోవడానికి IP64 రేటింగ్‌తో పాటు సైనిక స్థాయి మిలిటరీ గ్రేడ్ (MIL STD 810H) రక్షణతో వస్తుంది. ఇవే కాకుండా 5G సపోర్ట్, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, పాతకాలపు వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడుకోవడానికి 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో అందించడం విశేషం.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో దుమ్ము లేపనున్న Poco M8x 5G.. లాంచ్‌కు ముందే లుక్స్ లీక్!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×