BigTV English

April 2024 Launching Mobiles: కొత్త ఫోన్ కోనాలనుకుంటున్నారా..? ఏప్రిల్‌లో లాంచ్ కానున్న మొబైల్స్ ఇవే.. ఓ లుక్కేయండి

April 2024 Launching Mobiles: కొత్త ఫోన్ కోనాలనుకుంటున్నారా..? ఏప్రిల్‌లో లాంచ్ కానున్న మొబైల్స్ ఇవే.. ఓ లుక్కేయండి

April Launching Mobiles 2024: స్మార్ట్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకనే కంపెనీలో కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే అనేక ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. అంతేకాకుండా ప్రతి నెలలోనూ లెటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2024 ఏప్రిల్‌లో కూడా కంపెనీలు కొత్త మోడల్ స్మార్ట్‌‌ఫోన్లను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. మార్చిలో నథింగ్ ఫోన్ (2a), Vivo T3 5G నుండి Poco C61 ఇతర మోడళ్లతో సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఏప్రిల్‌లో కూడా OnePlus Nord CE 4 నుండి Motorola Edge 50 Pro, Samsung Galaxy M55 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.


Samsung Galaxy M55 5G

Samsung భారతదేశంలో Galaxy M55 5Gను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్‌ను అమోజాన్‌లో తీసుకురానుంది. Samsung Galaxy M55 5G Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌పపై రన్ అవుతుంది. లాండ్ డేట్ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మిడ్‌రేంజ్ ప్రైజ్‌లో ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.


Also Read: అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ.145కే 4K కెమెరా!

OnePlus Nord CE 4 5G

OnePlus Nord CE 4 5G FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Nord CE 4 ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.ఫోన్‌లో 8GB LPDDR4x RAM , 256GB UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14లో రన్ అయ్యే అవకాశం ఉంది. OnePlus Nord CE 4 రెండు వేరియంట్‌లలో రావచ్చు. వీటి ధర 8GB + 128GB ధర రూ. 24,999, 8GB + 256GB ధర రూ. 26,999గా ఉండనుంది.

Motorola Edge 50 Pro

ఇది 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ పోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 144Hz,  Pantone రంగులకు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 2,000 నిట్‌ల బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. Edge 50 Pro 12GB RAM + 512GB కాన్ఫిగరేషన్‌తో లభిస్తోంది. దీని ధర రూ. 44,999. లావెండర్ పర్పుల్, పెరల్ వైట్ మరియు బ్లాక్ ఎక్లిప్స్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 3న ఫోన్ లాంచ్ కానుంది.

April Month Launching MobilesApril Month Launching Mobiles

Also Read: ఇదే మొదటిసారి..వన్‌ప్లస్‌పై భారీ తగ్గింపు!

Realme GT 5 Pro

Realme ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో Realme GT 5 ప్రోని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. చైనాలో లాంచ్ అయిన Realme GT 5 Pro 6.78-అంగుళాల BOE OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్,1600 nits వరకు బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 3 SoC ఉంది. ఈ ఫోన్‌లో 16GB LPDDR5X RAM, 1TB UFS 4.0 స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్ 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Realme c65

Realme తన తాజా స్మార్ట్‌ఫోన్ Realme C65ని ఏప్రిల్ 4న మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్   ప్రస్తుతం వియత్నాంలో విడుదలయింది. ఇది త్వరలో ఇతర మార్కెట్లలో కూడా లాంచ్ కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కంపెనీ తన లాంచ్‌ను ధృవీకరించింది. Realme వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు కూడా ఫోన్ యొక్క టీజర్ చిత్రాన్ని షేర్ చేశారు.

Tags

Related News

WhatsApp Scam: వాట్సాప్ నయా స్కామ్, షేర్ చేశారో అకౌంట్ ఖాళీ అవ్వడం పక్కా!

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Lava AMOLED 2 vs Moto G45 vs iQOO Z10 Lite: రూ.15000 బడ్జెట్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలంటే?

Pixel 9 Pro Fold Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.43,000 తగ్గింపు..

HTC Vive Eagle Glasses: వాయిస్ కంట్రోల్‌తో వీడియో, ఫొటోలు తీసే ఏఐ గ్లాసెస్.. హెచ్‌టిసి వైవ్ ఈగల్ లాంచ్

Big Stories

×