BigTV English

Realme Watch S2 Launch: ఉమెన్స్ స్పెషల్ స్మార్ట్‌వాచ్.. పీరియడ్స్ గురించి చెప్పేస్తుంది!

Realme Watch S2 Launch: ఉమెన్స్ స్పెషల్ స్మార్ట్‌వాచ్.. పీరియడ్స్ గురించి చెప్పేస్తుంది!

Realme Watch S2 Launch: టెక్ మేకర్ రియల్‌మీ అనేక కొత్త గ్యాడ్జెట్లను విడుదల చేసింది. ఇందులో రియల్‌మీ 13 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, బడ్స్ T310 TWS, రియల్‌మీ వాచ్ S2 ఉన్నాయి. ఈ వాచ్ ఆగస్ట్ 5 న సేల్‌కు రానుంది. ఇందులో AI ఫీచర్లు ఉంటాయి. 600 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో 1.43-అంగుళాల అమ్లోడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 4GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ కూడా లభిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


రియల్‌మీ వాచ్ S2 బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. దీని ధర రూ. 4,999గా కంపెనీ నిర్ణయించింది. గ్రే స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాప్ ధర రూ.5,299. ఆగస్ట్ 5 నుండి కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌లలో సేల్‌కి రానుంది.

Also Read: Flipkart iPhone Days Sale 2024: ఆఫర్ల జోరు.. ఐఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. ఇంత తక్కువ ఎలా?


Realme Watch S2 Features
ఈ స్మార్ట్‌వాచ్ స్టెయిన్‌లెస్ స్టీల్ టెక్చర్డ్ బాడీతో రౌండ్ డయల్‌ను కలిగి ఉంది. ఇది IP68 రేటెడ్ వాటర్-రెసిస్టెంట్ 5 మీటర్ల వరకు వస్తుంది. ఆపరేటింగ్ బటన్స్ రైట్ సైడ్ ఉంటాయి. 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్‌‌తో 1.43-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది AI టెక్స్ట్-టు-ఇమేజ్ టెక్నాలజీని ఉపయోగించి వాచ్ ఫేస్‌లను క్రియేట్ చేసే స్మార్ట్‌వాచ్ ఫేస్ ఇంజన్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌వాచ్ మరో పెద్ద ఫీచర్ ఏమిటంటే మీరు స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయకుండానే మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీని కోసం కంపెనీ 4GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను అందిస్తోంది. ఇది డ్యూయల్-మోడ్ బ్లూటూత్ చిప్, ఇంటర్నల్ స్పీకర్, క్రిస్టల్-క్లియర్ కాలింగ్ కోసం మైక్రోఫోన్‌ కలిగి ఉంటుంది.

రియల్‌మీ వాచ్ S2 సూపర్ AI ఇంజన్, AI పర్సనల్ అసిస్టెంట్ చాట్‌జిపిటి 3.5 టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంది. మీరు Realme Link యాప్ ద్వారా వాయిస్ కమాండ్‌లు, టెక్స్ట్ ఆధారిత ప్రశ్నలను ఇవ్వవచ్చు. మహిళల ఫిట్‌నెస్‌ కోసం ఇందులో హార్ట్ మానిటర్, SpO2 సెన్సార్, స్లీప్, పీరియడ్స్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్‌వాచ్‌లో మీరు ఆటోమేటిక్ రికగ్నిషన్‌తో 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌ల సపోర్ట్ ఉంటుంది. వాచ్‌లో సెడెంటరీ, హైడ్రేషన్ రిమైండర్‌లు కూడా ఉన్నాయి.

Also Read: Nothing Phone 2a Plus Launch: తోపు ఫోన్ వచ్చింది.. నథింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. మాములుగా లేదే!

ఈ వాచ్‌తో కనెక్ట్ చేసిన గ్యాడ్జెట్ కెమెరా, సాంగ్స్ ఆపరేట్ చేయవచ్చు. ఈవెంట్ రిమైండర్‌లు, వెదర్ అప్‌డేట్‌లు మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని బెటర్ చేస్తాయి. వాచ్ S2 380mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై  20 రోజుల వరకు బ్యాకప్‌ను అందిస్తుంది.

Tags

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×