BigTV English

India vs Sri Lanka 3rd T20I: ఎన్నో విశేషాల.. మూడో టీ 20 మ్యాచ్

India vs Sri Lanka 3rd T20I: ఎన్నో విశేషాల.. మూడో టీ 20 మ్యాచ్

India vs Sri Lanka Match Highlights(Cricket news today telugu): భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ 20 మ్యాచ్ ని చూసిన అభిమానులెవరూ మరిచిపోలేకపోతున్నారు. అంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగిపోయింది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిచిన తీరుతో ఎన్నో విశేషాలతో నిండిపోయింది. వాటిని ఒకసారి తెలుసుకుందాం..


శ్రీలంకపై మూడోసారి టీ 20 సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. 2017, 2022 లో శ్రీలంకతో జరిగిన సిరీస్ ల్లో భారత్ ఇలాగే రౌండప్ చేసింది.

టీ 20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్న నాలుగో ఆటగాడిగా సూర్యకుమార్ (5) నిలిచాడు. తనకన్నా ముందు విరాట్ కొహ్లీ(6), డేవిడ్ వార్నర్ (5), షకీబ్ (5) ఉన్నారు.


ఇకపోతే టీ 20ల్లో అత్యధిక ఓటములు పొందిన జట్టుగా శ్రీలంక (105) నిలిచింది. బంగ్లాదేశ్ (104)తో తన తర్వాత స్థానంలో ఉంది. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కూడా టీమ్ ఇండియా విజయం సాధించడం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు 8 వికెట్లు తీశారు. సూర్యా 2, రింకూ సింగ్ 2, వాషింగ్టన్ సుందర్ 2, రవి బిష్ణోయ్ 2 తీశారు. అయితే సూపర్ ఓవర్ చూస్తే మరో 2 వికెట్లు ఉంటాయి. ఇలా ఒక టీ 20 మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీసిన మూడో మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2022లో వెస్టిండీస్ పై మన స్పిన్నర్లు 10 వికెట్లు తీశారు.

Also Read: సంజూ శాంసన్ కి ఏమైంది? 

ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డును వాషింగ్టన్ సుందర్ కి ఇచ్చారు. సూపర్ ఓవర్ తో కలిపి… వరుసబంతుల్లో రెండేసి వికెట్ల చొప్పున తీశాడు. అలా రెండు సార్లు కూడా హ్యాట్రిక్ మిస్సయ్యింది.

శ్రీలంక టీ 20 సిరీస్ కి కొత్త కెప్టెన్ గా చరిత్ అసలంక వచ్చాడు. మూడు మ్యాచ్ ల్లో కలిపి 14 రన్స్ మాత్రమే చేశాడు. అందులో రెండు మ్యాచ్ ల్లో మన సంజూ శాంసన్ లాగే డక్ అవుట్ అయ్యాడు.

Related News

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

Big Stories

×