BigTV English
Advertisement

Redmi Turbo 3: రెడ్ మీ నుంచి 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!

Redmi Turbo 3: రెడ్ మీ నుంచి 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!
Redmi Turbo 3
Redmi Turbo 3

Redmi Turbo 3 Launching with 200 Mega Pixel Camera: ప్రముఖ టెక్ కంపెనీ రెడ్‌మీకి మొబైల్ మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. కంపెనీ తరచూ కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటుంది. మొబైల్ లవర్స్‌కు అట్రాక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ త్వరలో న్యూ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. కంపెనీ టర్బో సిరీస్ ఫోన్లను చైనా మార్కెట్‌లో  లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది ‘Turbo’ సిరీస్‌లో కంపెనీ మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఉండనుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ రెడ్‌మీ Turbo 3 హ్యాండ్ ఆన్ ఇమేజ్‌ని అలానే రాబోయే ఫోన్ వెనుక ప్యానెల్‌ను చూపించే రెండు ఫోటోలను షేర్ చేసింది. కంపెనీ ఇంకా ఫోన్ ఫీచర్లను వెల్లడించలేదు. అయితే లీకైన ఫోటో దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది.


Weiboలో టిప్‌స్టర్ షేర్ చేసిన మొదటి ఫోటో వెనుక ప్యానెల్ ఎడమ వైపున రెండు కెమెరాలను చూడవచ్చు. అలానే మధ్యలో మూడవ కెమెరా ఉన్నట్లుగా ఉంది. ప్యానెల్ కుడి వైపున రౌండ్ షేపుడ్ LED ఫ్లాష్ లైట్ ఉంది. చిన్న అక్షరాలలో Redmi బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది.

Also Read: అరేయ్ ఏంది మామా ఇది.. రూ.12వేల స్మార్ట్ వాచ్.. రూ.118కే పొందొచ్చట!


GSMArena ప్రకారం.. Turbo 3 స్మార్ట్‌ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఫోన్‌లో సెకండరీ కెమెరాతో పాటు మాక్రో కెమెరా మధ్యలో సెట్ చేశారు.

టిప్‌స్టర్ కథనం ప్రకారం.. రెడ్‌మీ టర్బో 3 రెండు కలర్ వేరియంట్‌లలో రానుంది. ఇందులో వైట్, బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఇది మంచి లేటెస్ట్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. లీకైన రెండర్‌లు ఫోన్ వెనుక ప్యానెల్ ఫోన్ కుడి ,ఎడమ వైపుకు వంగి ఉన్నట్లు కూడా చూడొచ్చు. వెనుక ప్యానెల్‌ను చూస్తే ఫోన్ ఎడమ వైపున వాల్యూమ్, పవర్ బటన్‌లు కనిపిస్తున్నాయి.

Also Read: వివో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్

ప్రాసెసర్..

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8s Gen 3 SoC ప్రాసెసర్‌పై రానుంది. ఫోన్‌లో 6.78 ఇంచెస్ OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6,000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు చేస్తుంది.

Tags

Related News

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

iphones Stolen: ఒకే నగరంలో 80000 ఐఫోన్లు దొంగతనం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Oneplus Nord 2T Ultra 5G: వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ అల్ట్రా 5జీ.. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

AI Hospital Bill Error: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Big Stories

×