ప్రపంచ వ్యాప్తంగా 3,000 రకాల పాముల జాతులు ఉన్నాయి. వాటిలో 2500 రకాల పాములకు విషం ఉండదు. మిగతా 500 రకాల పాములు విషపూరితమైనవి. వాటిలో దాదాపు 400 రకాల పాములు అత్యంత ప్రాణాంతకమైనవి. ఈ పాములు కరిస్తే కచ్చితంగా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. వీటిలో కొన్ని పాముల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ కింగ్ కోబ్రా: ఇవి ఆసియాలో ఎక్కువగా ఉంటాయి. మన దేశంలోనూ ఈ పాములు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోనే పొడవైన, అత్యంత విషపూరితమైన పాము ఇది. 18.8 అడుగుల పొడవు వరకు ఉంటుంది. ఈ పామును మనిషిని కరిస్తే, బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
⦿ సా స్కేల్డ్ వైపర్: అత్యంత డేజరస్ పాములలో ఇది ఒకటి. సాధారణంగా ఈ పాములు భారత్, చైనాతో పాటు ఆసియా ఖండంలో ఉంటుంది. ఈ వైపర్లు రాత్రి పూట యాక్టివ్ గా ఉంటాయి. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే, నోటి నుంచి రక్తస్రావం ప్రారంభమవుతుంది. హృదయ స్పందన రేటు తగ్గిపోతుంది. నెమ్మదిగా బీపీ తగ్గిపోతుంది. తీవ్రంగా కాటు వేస్తే, ఒక రోజులోనే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది.
⦿ బ్లాక్ మాంబా: ఆఫ్రికాలో అత్యధికంగా మనుషుల చావుకు కారణం అయిన పాము ఇది. ఆఫ్రికా అంతటా ఈ పాము ఉంటుంది. ఈ పాము కాటు వేయడం మొదలు పెడితే వరుసగా 12 సార్లు కాటు వేస్తుంది. ప్రాణాంతక న్యూరోటాక్సిన్‌లను విడుదల చేస్తుంది. బ్లాక్ మాంబా కాటు వేస్తే మనిషి కేవలం 15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
⦿ బూమ్స్‌లాంగ్: ఈ పాము ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకు కారణమైంది. ఈ పాములు ఎక్కువగా దక్షిణాఫ్రికా, సబ్-సహారా ఆఫ్రికాలో ఉంటుంది. ఈ పాములు కాటు వేసే సమయంలో తన దవడలను 170 డిగ్రీల వరకు తెరుస్తాయి. ఈ పాము కాటు తర్వాత లక్షణాలు వెంటనే కనిపించవు. ఫలితంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా యాంటీడోస్ ఇప్పటించుకుంటే మంచిది.
⦿ బ్లాక్ టైగర్ స్నేక్స్: బ్లాక్ టైగర్ పాములు అత్యంత విషపూరితమైనవి. ఈ పాము కరిసిన అరగంటలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పాము కాటుకు గైన వాళ్ల మరణాలు సాధారణంగా ఆరు నుండి 24 గంటల మధ్య సంభవిస్తాయి. నిజానికి ఈ పాములు మనుషులను చూస్తే భయపడుతాయి. వాటిని రెచ్చగొడితే దాడి చేస్తాయి.
⦿ ఇన్లాండ్ తైపాన్: ఈ పాము తన విషంలో టైపాక్సిన్, న్యూరోటాక్సిన్ ను మనిషిలోకి పంపిస్తుంది. వెంటనే రక్త రక్తస్రావం, శ్వాస సమస్యలు, పక్షవాతం, తీవ్రమైన కండరాల సమస్య తలెత్తుతుంది. ఈ పాము కరిస్తే కేవలం అరగంటలో చనిపోయే అవకాశం ఉంటుంది. కేవలం 30 నుండి 45 నిమిషాల్లోనే మరణం సంభవించవచ్చు.
⦿ పఫ్ యాడర్: పఫ్ యాడర్ లేదంటే బిటిస్ అరియెటన్స్ అత్యంత భయంకరమైనది. ఇతర ఆఫ్రికన్ పాములతో పోలిస్తే ఎక్కువ మరణాలకు కారణమవుతుంది. ఆఫ్రికన్ సవన్నా, గడ్డి భూములలో కనిపించే పఫ్ యాడర్.. పొడవైన కోరల కారణంగా పెద్ద మొత్తంలో పాము విషం విడుదల అవుతుంది.
⦿ ఇండియన్ కోబ్రా: మన దేశంలో అత్యంత చురుకైన పాములలో ఒకటి. ఈ పాము కరిస్తే మనిషి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పాము కాటు కారణంగా పక్షవాతం, శ్వాసకోశ సమస్య, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ లక్షణాలు అన్నీ 15 నుంచి రెండు గంటల వరకు జరుగుతాయి.
⦿ గబూన్ వైపర్: ఆఫ్రికాలోని వర్షారణ్యాలు, సవన్నాలలో నివసిస్తాయి. వైపర్ కుటుంబంలోని మిగిలిన వాటిలాగే, ఇది చాలా విషపూరితమైన పాము. సుమారు 2 అంగుళాల పొడవైన కోరలు ఉంటాయి. ఈ పాము కరిస్తే 15 నిమిషాల్లోనే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది.
Read Also: జెర్రిపోతును మింగిన నాగు పాము.. స్నేక్ ఫైటింగ్.. వీడియో వైరల్