E-Paper
Advertisement

వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు..బెస్ట్ సౌండ్ ఇచ్చే టాప్ 5 మోడల్స్!

వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు..బెస్ట్ సౌండ్ ఇచ్చే టాప్ 5 మోడల్స్!
Advertisement

Best waterproof bluetooth speakers: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్‌తో కలిసి పూల్ పార్టీ ప్లాన్ చేయడం, చిల్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది! అయితే.. ఆ పార్టీకి సరైన మ్యూజిక్ కిక్ లేకపోతే వైబ్స్ రావు. నీళ్ల దగ్గర నార్మల్ స్పీకర్లు పెడితే పాడైపోతాయనే భయం ఉంటుంది. అందుకే.. నీళ్లలో మునిగినా, వాటర్ స్ప్లాష్‌లకు పాడవకుండా అదిరిపోయే హెవీ బాస్ అండ్ క్లియర్ సౌండ్ ఇచ్చే మోడల్స్ మనకు కావాలి. మీ పూల్ పార్టీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే 5 క్రేజీ వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

5 వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు:

JBL Charge 5 – ఆల్ రౌండర్ పార్టీ కింగ్

Advertisement

పూల్ పార్టీల విషయానికి వస్తే జేబీఎల్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ మోడల్‌లో ఉన్న IP67 వాటర్‌ప్రూఫ్ & డస్ట్ ప్రూఫ్ రేటింగ్ వల్ల నీటి చినుకులు పడినా లేదా నీళ్లలో మునిగినా ఏమీ కాదు. దీంట్లో ఉన్న డ్యూయల్ పాసివ్ రేడియేటర్ల వల్ల ఓపెన్ స్పేస్‌లో కూడా క్లియర్ బాస్ వస్తుంది. అంతేకాకుండా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 20 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తుంది. నీటి దగ్గర చిల్ అవుతున్నప్పుడు ఫోన్ ఛార్జ్ అయిపోతే.. స్పీకర్ నుంచే ఛార్జ్ చేసుకునే ఇన్-బిల్ట్ పవర్ బ్యాంక్ ఆప్షన్ కూడా ఉండటం దీని ప్రత్యేకత.

Ultimate Ears WONDERBOOM 3/4 – నీళ్లలో తేలే స్పీకర్:

పూల్ పార్టీలో స్పీకర్ నీటి అడుగున మునిగిపోకుండా నీళ్ల పైనే తేలాలి అనుకుంటే.. ఇది పర్ఫెక్ట్ మోడల్. ఇది 360-డిగ్రీ ఆడియోను అందిస్తూ నీటిపై ఫ్లోట్ అవుతుంది. దీంట్లో ఉండే ‘అవుట్‌డోర్ బూస్ట్’ మోడ్ ఆన్ చేస్తే నీటి సౌండ్స్ మధ్య కూడా విపరీతమైన లౌడ్ అండ్ క్లియర్ మ్యూజిక్ వినబడుతుంది. పూర్తి IP67 వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో రావడం వల్ల నీటిలో ఎలా వాడినా ఇది సురక్షితంగా ఉంటుంది.

Advertisement

Bose SoundLink Flex – నెక్స్ట్ లెవెల్ క్లారిటీ :
సౌండ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ వద్దు అనుకునే మ్యూజిక్ లవర్స్‌కి ఇది డ్రీమ్ స్పీకర్ అని చెప్పవచ్చు. దీంట్లోని టెక్నాలజీ వల్ల స్పీకర్‌ను ఎలా పడుకోబెట్టినా, నిలబెట్టినా సౌండ్ ట్యూనింగ్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయి అద్భుతమైన ఆడియోను ఇస్తుంది. క్లాసిక్ లుక్, పవర్ ఫుల్ బాస్‌తో పాటు IP67 వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్ కలిగి ఉండటమే కాకుండా, పొరపాటున నీళ్లలో పడినా వెంటనే పైకి తేలుతుంది.

Tribit StormBox Micro 2 – బడ్జెట్ ఫ్రెండ్లీ :
తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ ఇచ్చే స్పీకర్ కావాలంటే ట్రిబిట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. పరిమాణంలో చాలా చిన్నదే అయినా ఇది మైండ్ బ్లోయింగ్ పంచ్ బాస్‌ను అందిస్తుంది. దీని వెనక బెల్ట్ స్ట్రాప్ ఉంటుంది కాబట్టి పూల్ సైడ్ గ్రిల్స్‌కి లేదా బ్యాగ్‌కి ఈజీగా తగిలించుకోవచ్చు. పూర్తి వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో రావడం వల్ల పూల్ పార్టీలకు ఇది చాలా హ్యాండీగా ఉపయోగపడుతుంది.

Also Read: రూ. 498 కే బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్..ఆఫర్ అంటే ఇది కదా!

Sony ULT FIELD 1 – హెవీ బాస్ లవర్స్ కోసం:
సోనీ నుంచి వచ్చిన ఈ మోడల్ పూల్ పార్టీల్లో బెస్ లవర్స్ కు విపరీతంగా నచ్చుతుంది. దీంట్లోని ‘ULT’ బటన్ ప్రెస్ చేయగానే డీప్ బాస్, పంచీ ఆడియో ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. IP67 రేటింగ్ ఉండటం వల్ల నీళ్లు, దుమ్ము పడినా తట్టుకోవడమే కాకుండా, ఇది షాక్ ప్రూఫ్ బిల్డ్‌తో వస్తుంది. పూల్ పార్టీల రచ్చకు ఈ స్పీకర్ ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది.

పూల్ పార్టీలకు స్పీకర్ కొనేటప్పుడు కేవలం IPX5 లేదా IPX6 స్ప్లాష్ ప్రూఫ్ ఉన్నవి కాకుండా.. ఖచ్చితంగా IP67 లేదా IPX7 రేటింగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇవి మాత్రమే నీటిలో మునిగినా పాడవకుండా ఉంటాయి.

Related News

ఉన్నట్టుండి Pixel 11 Series ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? లీకైన వివరాలు ఇవే!

అమ్మాయిల కోసం స్టైలిష్ & సేఫ్ స్మార్ట్‌వాచ్ ..ధర కూడా చాలా తక్కువ

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫ్రిజ్ కావాలా? మార్కెట్‌లో రచ్చ లేపుతున్న మోడల్ ఇదే

వాట్సప్ యూజర్లకు ఊహించని సర్‌ప్రైజ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో సీన్ మొత్తం మారిపోయింది!

ఈ ఒక్క ఫీచర్ చాలు బ్రో.. Honor Band 11ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!

చిన్న రూమ్‌కి పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ.. ఆఫర్‌లోనే వచ్చేస్తోంది బాస్

చౌక ధరలో చల్లని గాలి.. రూ.1000 లోపు బెస్ట్ నెక్ ఫ్యాన్లు.. హాయిగా రోడ్డుపై తిరగొచ్చు!

Big Stories

Advertisement
×