BigTV English

WhatsApp : వాట్సాప్ చాట్ మరింత కొత్తగా! న్యూ ఇయర్ స్పెషల్ స్టిక్కర్స్.. స్పెషల్ థీమ్ తో!

WhatsApp : వాట్సాప్ చాట్ మరింత కొత్తగా! న్యూ ఇయర్ స్పెషల్ స్టిక్కర్స్.. స్పెషల్ థీమ్ తో!

WhatsApp : తన యూజర్స్ కోసం స్పెషల్ స్టిక్కర్స్ ను అందుబాటులోకి తెచ్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక థీమ్ తో కాల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ ఫిల్టర్స్ ను ప్రత్యేక స్టిక్కర్స్ తో మొదలు పెట్టేసింది. పర్సనల్ చాట్ తో పాటు ప్రతీ విషయంలోనూ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇక సెలబ్రేషన్ ఎమోజీలు, కాన్ఫెట్టి యానిమేషన్‌ను సైతం ఇందులో జోడించింది. ఇక కొత్త ఫీచర్లలో వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్, టైపింగ్ ఇండికేటర్లు, గ్రూప్ కాల్స్ కోసం పార్టిసిపెంట్ సెలక్షన్స్ సైతం ఉన్నాయి.


వాట్సాప్ కాలింగ్ ఎఫెక్ట్, స్టిక్కర్ ప్యాక్ తో పాటు న్యూ ఇయర్ కోసం మరిన్ని కొత్త ఫీచర్‌లను జోడించింది. ఈ కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ శుభాకాంక్షలను ప్రత్యేక రీతిలో పంచుకోటానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌లు డిసెంబర్ 20 నుండి జనవరి 3 వరకూ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఫీచర్‌లను పొందడానికి, వినియోగదారులు అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని మెటా తెలిపింది.

మెటా యాజమాన్యం ఈ ఫీచర్స్ పై స్పందిస్తూ.. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ కొత్త ఫిల్టర్‌లతో పాటు వీడియో కాల్స్ కోసం స్పెషల్ ఫీచర్స్ ను తీసుకొచ్చింది. అయితే న్యూ ఇయర్ కు ఇది యూజర్స్ కు స్పెషల్ గిఫ్ట్ అనే చెప్పాలి. వాట్సప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్స్ గ్రూప్ చాట్ లో సైతం ఎంతో అలరిస్తాయని.. పండగ వాతావరణం క్రియేట్ చేస్తాయని తెలిపింది. ఇక ఈ ఫిల్టర్స్ ను ఉపయోగించిన వారికి పంపించిన వారితో పాటు రిసీవ్ చేసుకున్న వారికి సైతం కాన్ఫెట్టి యానిమేషన్‌ను చూపుతుంది తెలిపింది. ఇక ఈ వాట్సాప్ చాట్ లో కొత్త స్టికర్ ప్యాక్ తో పాటు అవతార్ స్టిక్కర్స్ సైతం మెటా కొత్తగా పరిచయం చేసింది.


అయితే ఇప్పటికే మెటా వీడియో కాల్స్ కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. డాగ్ ఎఫెక్ట్స్, కరోకే మైక్ ఎఫెక్ట్, వాటర్ థీమ్ లాంటి ఎఫెక్ట్స్ ను తాజాగా జోడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వినియోగదారులు 10కి పైగా స్పెషల్ ఎఫెక్ట్స్ ను వాట్సాప్ లో కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు మొత్తం చాట్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రూప్ కాల్స్ కోసం సైతం ఈ స్పెషల్ ఫీచర్స్ ను మెటా తీసుకొచ్చింది.

అయితే, WhatsApp చాట్‌లలో రియల్ టైమ్ ఎంగేజ్‌మెంట్ గురించి వినియోగదారులకు చెప్పటానికి సైతం టైపింగ్ సూచనలు మెటా చేసింది. వినియోగదారులు ఒకరితో ఒకరు లేదా గ్రూప్ లోనైనా సంభాషణలలో టైప్ చేస్తున్న యూజర్ ప్రొఫైల్ పిక్ తో పాచు చాట్ లోని విషయాలను సైతం క్లియర్ గా చూడగలరు. ఇక వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్‌లను కూడా జోడించింది. ఇది ఆడియో సందేశాల టెక్స్ట్ ఆధారిత ట్రాన్స్‌క్రిప్షన్‌ను అందించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. అయితే మెసేజ్ ను రిసీవ్ చేసుకున్న వారికి వాయిస్ సందేశాల ట్రాన్స్క్రిప్ట్ అందుతుంది.. పంపినవారికి మాత్రం అందదు. ఇక మీకూ ఈ ఫిల్టర్స్ కావాలనుకుంటే లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ట్రై చేసేయండి.

ALSO READ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్! ఒక్క సబ్స్క్రిప్షన్ తో వేరు వేరు లాగిన్స్ ఇకపై చెల్లవ్

Tags

Related News

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×