HMD Key 2: రోజూ వాడే ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుంటే, లేదా ఏ పని చేసుకుంటున్నా సడన్‌గా బ్యాటరీ అయిపోతుంటే ఎవరికైనా చిరాకు రావడం సహజం. అలాగని వేల రూపాయలు పోసి ఖరీదైన ఫోన్లు కొనుక్కోలేం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే, తక్కువ బడ్జెట్‌లో ఒక అదిరిపోయే ఫోన్ మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే HMD Key 2. అనవసరమైన హంగు ఆర్భాటాలు లేకుండా, రోజూవారీ పనులన్నీ సాఫీగా జరిగిపోయేలా దీన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలోనూ, సోషల్ మీడియాలోనూ దీని గురించే జోరుగా చర్చ నడుస్తోంది. అసలు ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఏయే ఫీచర్లు ఉండొచ్చో.. ఇప్పుడు ఒక లుక్ వేద్దాం రండి..
ఈ HMD Key 2 ఫోన్ డిజైన్, డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనిలో 6.52 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉండొచ్చని సమాచారం. అలాగే ఇది హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ వరకు ఉండొచ్చు. వీడియోలు చూసేందుకు, సోషల్ మీడియా వాడేందుకు ఈ డిస్ప్లే సరిపోతుంది. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇది బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభించే అవకాశం ఉంది. చూడటానికి చాలా సింపుల్‌గా, ట్రెండ్‌గా ఉండేలా దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: షాపింగ్ ప్రియులకు అలర్ట్.. Flipkart Big Billion Days సేల్ డేట్స్ వచ్చేసాయోచ్!
ఫోన్ పనితీరు పరంగా చూసుకుంటే.. దీనిలో యునిసోక్ ఎస్సీ9863ఏ చిప్‌సెట్ వాడే ఛాన్స్ ఉంది. దీనికి తోడు 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వొచ్చు. అంతేకాకుండా.. అవసరమైతే మరో 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ను కూడా ఉపయోగించుకునే సౌలభ్యం ఉండొచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌పై పనిచేస్తుంది. తక్కువ హార్డ్‌వేర్ ఉండే ఫోన్లలో సాఫ్ట్‌వేర్ సజావుగా సాగేలా ఈ గో ఎడిషన్ ప్రత్యేకంగా సహాయపడుతుంది.
ఫోన్ వెనకభాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వనున్నారు. ఇందులో మెయిన్ కెమెరా 13MPతో వస్తుంది. దీనికి తోడుగా మరొక 0.3MP సెన్సార్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 5MP కెమెరాను పొందుపరిచారు. ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన హైలైట్ ఏంటంటే దీని బ్యాటరీనే. దీనిలో 5000mah బ్యాటరీని ఇస్తున్నారు. దీనికి 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రోజంతా ఫోన్ వాడే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
HMD Key 2 ఫోన్ ధర ఎంత ఉండొచ్చు, ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనే విషయాలపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే.. ఇది ఎంట్రీ లెవల్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, సాధారణ కెమెరా, బేసిక్ ఫీచర్లు కోరుకునే బడ్జెట్ యూజర్లకు ఇది ఒక మంచి ప్రాక్టికల్ ఛాయిస్ అవుతుంది.