E-Paper
Advertisement

శామ్‌సంగ్ సర్ప్రైజ్.. ప్రకటనకు ముందే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఫోన్..

శామ్‌సంగ్ సర్ప్రైజ్.. ప్రకటనకు ముందే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఫోన్..
Advertisement

Galaxy A27 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung) తన వినియోగదారులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. గెలాక్సీ ‘A’ సిరీస్‌లో సరికొత్త మోడల్‌గా రాబోతున్న Samsung Galaxy A27 5G ఫోన్‌ను, ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటన లేదా లాంచ్ ఈవెంట్ లేకుండానే కంపెనీ లైన్‌లోకి తెచ్చింది. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన అధికారిక శామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను నేరుగా లిస్ట్ చేయడంతో, దీనికి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు, ఫీచర్ల వివరాలన్నీ అధికారికంగా బయటకు వచ్చాయి.

Read also-ఆ బుల్లితెర నటికి ఆడపిల్ల.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

Advertisement

డిజైన్, డిస్‌ప్లే పరంగా గెలాక్సీ A27 5G చాలా ప్రీమియంగా కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగం ఫ్లాట్‌గా ఉండి, ఎడమవైపు పైభాగంలో పిల్-షేప్డ్ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు, అలాగే ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ఇచ్చారు. ఇందులో 6.7 ఇంచుల Full-HD+ సూపర్ అమోలెడ్ (Super AMOLED) స్క్రీన్‌ను అందించారు. ఇది స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్స్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ క్వాల్కమ్ ఆక్టా-కోర్ Snapdragon 6 Gen 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లోని అత్యంత కీలకమైన హైలైట్ ఏంటంటే.. దీనికి ఏకంగా 6 సంవత్సరాల పాటు మేజర్ OS అప్‌గ్రేడ్స్, అలాగే 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని శామ్‌సంగ్ హామీ ఇచ్చింది. మధ్యతరగతి రేంజ్ ఫోన్లలో ఈ స్థాయి సుదీర్ఘమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం విశేషం.

Advertisement

Read also-గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 5 విషయాలను వెతకకండి.. ఎందుకో తెలుసా?

ఇక కెమెరాల విషయానికి వస్తే, వెనుక వైపు f/1.8 అపెర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలను, ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీనితో పాటు 5,000mAh భారీ బ్యాటరీ, దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లను అందించారు. బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్ మరియు లైట్ పింక్ రంగుల్లో, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లలో రాబోతున్న ఈ ఫోన్ ధర, గ్లోబల్ లాంచ్ వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. ఈ ఫోన్ బడ్జెట్ లో బలే ఫీచర్లతో రాబోతున్నందున ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×