E-Paper
Advertisement

రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!

రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!
Advertisement

Google Smart Glasses: స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే మన చుట్టూ జరిగే విషయాలను తెలుసుకోవడం, ఇతర భాషల్లో మాట్లాడేవారితో సులభంగా సంభాషించడం సాధ్యమైతే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే గూగుల్ కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొస్తోంది. జెమిని ఏఐ సాయంతో పనిచేసే ఈ కళ్లద్దాలు రోజువారీ పనులను మరింత సులభం చేయనున్నాయి. అయితే కెమెరా ఉన్న కళ్లద్దాలతో ఇతరుల ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా గూగుల్ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంది.

జెమిని ఏఐతో ఎన్నో పనులు..

వార్బీ పార్కర్, జెంటిల్ మాన్‌స్టర్, శాంసంగ్ సంస్థల సహకారంతో గూగుల్ ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందిస్తోంది. వీటిని పిక్సెల్, శాంసంగ్ ఫోన్లతో పాటు ఐఫోన్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్‌పై ట్యాప్ చేయడం లేదా Hey Gemini అని చెప్పడం ద్వారా ఏఐని ఉపయోగించవచ్చు. ఎదురుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి అడగటం, కనిపించిన వస్తువును గ్రోసరీ లిస్ట్‌లో చేర్చడం, గూగుల్ మ్యాప్స్ ద్వారా దారి తెలుసుకోవడం వంటి పనులు చేయొచ్చు. నోటిఫికేషన్లు చూడటం, పాటలు వినడం కూడా సాధ్యమే.

లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ కూడా..

Advertisement

ఈ కళ్లద్దాల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్ సాయంతో మాట్లాడే మాటలను వెంటనే మరో భాషలోకి మార్చుకోవచ్చు. జెమిని గైడెడ్ విజన్ ఫీచర్ చూపు తక్కువగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. చిన్న అక్షరాలను చదవడం, రోజూ వాడే వస్తువులను వెతకడంలోనూ సాయం చేస్తుంది. అవసరమైతే ఐరా ఎక్స్‌ప్లోరర్ ద్వారా కెమెరా ఫీడ్‌ను శిక్షణ పొందిన వ్యక్తికి పంపి సహాయం పొందొచ్చు.

Also Read: చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!

కెమెరా, ప్రైవసీకి రక్షణ..

Advertisement

ఫొటోలు, వీడియోల కోసం ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. అయితే కెమెరా ఉన్న కళ్లద్దాలతో ఇతరులకు తెలియకుండా రికార్డింగ్ చేసే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్ ప్రత్యేక నియమాలు పెట్టింది. జెమిని చూసే కెమెరా దృశ్యాలు చాట్ హిస్టరీలో సేవ్ కావని, ఏఐ శిక్షణకు లేదా ప్రకటనలకు వాడబోమని చెబుతోంది. ప్రాసెస్ చేసే ముందు ఇతరుల ముఖాలను హైడ్ చేస్తుంది. డేటా ఎన్‌క్రిప్షన్‌తో భద్రంగా ఉంటుంది. కెమెరా, మైక్ అనుమతులను యూజర్లు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఫొటో, వీడియో తీసేటప్పుడు వెలిగే సూచిక లైట్‌ను కవర్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది. కళ్లద్దాలను పూర్తిగా ఆఫ్ చేసి సాధారణ కళ్లద్దాల్లా వాడొచ్చు.

ధర, విడుదల వివరాలు..

జెంటిల్ మాన్‌స్టర్ మోడళ్ల ధర రూ.42,322 నుంచి మొదలవుతుంది. వార్బీ పార్కర్ మోడళ్ల ధర దాదాపు రూ.37,231. రెండు బ్రాండ్లలోనూ తమకు నచ్చిన డిజైన్లు, రంగులు, లెన్స్ ఎంపికలు ఉంటాయి. చాలా ఫ్రేమ్‌లకు ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను ఎంచుకోవచ్చు. అమెరికా, దక్షిణ కొరియాలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రీ ఆర్డర్లు ఆన్‌లైన్‌లో, ఎంపిక చేసిన స్టోర్లలో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 10, 2026 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. భారత్‌లో విడుదలపై స్పష్టత లేదు. ఫీచర్లు ఆకట్టుకున్నా.. ధరతో పాటు ప్రైవసీ హామీలు నిజ జీవితంలో ఎంత బాగా పనిచేస్తాయో చూడాలి.

Also Read: టీనేజర్ల ఆట కట్టించేందుకు మెటా కొత్త అస్త్రం.. వయసు దాచినా ఇట్టే పట్టేస్తుంది ఈ ఏఐ టూల్!

Tags

Related News

ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్

చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!

జియో బంపరాఫర్.. ఆ ప్లాన్‌పై 84 రోజులు నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్!

చిన్నరూమ్స్ కోసం బెస్ట్ స్మార్ట్ టీవీ..తక్కువ ధరలో 1000+ యాప్స్,వాయిస్ కంట్రోల్ ఫ్రీ!

క్రేజీ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Huawei MatePad 11.5..ధర ఎంతంటే?

డబ్బు మనది.. పర్మిషన్ నెటిజన్లది, వైరల్‌ చైనా యాప్ కథేంటి?

జియో అదిరిపోయే ఆఫర్.. రూ.111, రూ.459 రీఛార్జ్‌లపై.. ఫ్రీగా స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్!

Big Stories

Advertisement
×