E-Paper
Advertisement

బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

Bigg Boss 10 Chaitra Rai: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎట్టకేలకు సెప్టెంబర్ 6వ తేదీన చాలా గ్రాండ్గా ప్రారంభం అయింది. మొత్తం 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్సుతో ఈ షో ఘనంగా ప్రారంభించారు. హోస్ట్ నాగార్జున (Nagarajuna) మరోసారి ఈ కొత్త సీజన్ కి బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా బిగ్ బాస్ షో ప్రారంభమైన తర్వాత మొదటి వారం కంటెస్టెంట్ కి సర్ప్రైజ్ ఇస్తూ ఎలిమినేషన్ ను నిలిపి వేస్తూ ఉంటారు. ఇక రెండవ వారం నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగేది. ఇంతకుముందు సీజన్లలో ఇలా జరిగిన విషయం తెలిసిందే. కానీ గత కొన్ని సీజన్లలో ఫస్ట్ వీకే ఎలిమినేట్ చేస్తూ ఆడియన్స్ ను కూడా ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సీజన్ 10లో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడం అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.. ముఖ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మొదటివారము ఇద్దరు ఎలిమినేట్..

ప్రస్తుతం షోలో త్రిగున్ వర్సెస్ రోహిత్ నాయుడు అన్నట్టు షో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ లో తాజాగా హై రిస్క్ జోన్ అంటూ ఒక కాన్సెప్ట్ పెట్టి ఎవరైతే పర్ఫామెన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నారో.. కంటెస్టెంట్స్ చేతే వారిని రిస్క్ జోన్ లో పంపించేలా ప్లాన్ చేశారు. అలా రాంప్రసాద్ , ఆర్ జె చరణ్ మధ్య పోటీ నిర్వహించగా.. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ రాంప్రసాద్ కి ఓటు వేయడంతో ఆయన సేవ్ అయ్యాడు. దీంతో మిడ్ వీక్ లో భాగంగా ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యారు.

చైత్ర కూడా ఎలిమినేట్..

Advertisement

నిన్నటికి నిన్న కృష్ణుడు, చైత్ర రాయ్ మధ్య పోటీ జరగగా.. కృష్ణుడు పేరు సరిగా పెట్టకపోవడం వల్ల ఆయన సేఫ్ అయ్యాడు. కానీ చైత్రారాయ్ డేంజర్ జోన్ లో పడిపోయింది. ఇక ఆమె కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శుక్రవారం ఎలిమినేట్ అయినట్లు స్టార్ మా ప్రకటించింది. మొదటి వారమే ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ బిగ్ బాస్ 10 లో ఈ రేంజ్ మార్పులు ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే మొదటి వారమే ఈమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో ఈ షో ద్వారా ఈమెకు ఎంత రెమ్యూనరేషన్ లభించింది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

చైత్ర అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైత్ర రాయ్ .. బిగ్ బాస్ సీజన్ 10 లోకి రూ.2.25 నుండి రూ.2.50 లక్షల ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఇకపోతే పూర్తి వారం ఆమె హౌస్ లో లేనందు వల్ల సుమారుగా రూ.2 లక్షలు ఈమెకు లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

also read: శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

సాధ్యమవుతుందా?

ఇదిలా ఉండగా మరొకవైపు మొదటి వారమే ఇద్దరు కంటెస్టెంట్లను మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేశారు. కానీ మళ్ళీ ఇద్దరినీ హౌస్ లోకి పిలిపించి ఇద్దరి మధ్య పోటీ పెట్టి, అందులో నెగ్గిన వారిని హౌస్ లో ఉంచి మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే రాత్రి ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

బిగ్ బాస్ షాలిని కన్నీళ్లు తెప్పించే స్టోరీ.. అయ్యో పాపం కదా…

Big Stories

Advertisement
×