దేశ స్వాతంత్ర్యం, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన గురించి RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలును కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన జరిగిన రోజునే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించిందని భగవత్ వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం అన్నారు. ఆయన వ్యాఖ్యలను దేశ ద్రోహంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. RSS చీఫ్ మీద తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. అందులో తమది రాజ్యాంగ సిద్దాంతం కోసం జరుగుతుంటే, మరొకటి RSS భావజాల సిద్దాంతం కోసం జరుగుతుందన్నారు. “ప్రస్తుతం దేశంలో రెండు సిద్దాంతాల నడుమ యుద్ధం జరుగుతున్నది. ఒకటి రాజ్యాంగ సిద్దాంతం కోసం జరుగుతుంటే, మరొకటి RSS సిద్దాంతం కోసం పని చేస్తున్నది. తాము రాజ్యంగం కోసం పోరాడుతుంటే, బీజేపీ RSS కోసం పోరాడుతున్నది. రామ మందిరం ప్రతిష్టాపన రోజే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పడం నిజంగా స్వాతంత్ర్య సమరయోధులను కించపరచడమే అవుతుంది. ఆంగ్లేయుల వారి మీద పోరాడిన సమరయోధునలను భగవత్ తక్కువ చేసి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా దేశద్రోహం కిందికి వస్తాయి. ఇకపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అని రాహుల్ సూచించారు.
దేశ విచ్ఛిన్న శక్తులను ఎదుర్కొనేది కాంగ్రెస్ ఒక్కటే!
కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగానికి, పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందన్న ఆయన, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తామన్నారు. అటు ఎన్నికల కమిషన్ సైతం అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తుందని రాహుల్ విమర్శించారు. లోక్ సభ ఎలక్షన్స్ తో పోల్చితే అసెంబ్లీ సమయానికి మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఓట్లు పెరిగాయన్నారు. ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలంటే సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ సూచించారు.
Mohan Bhagwat’s audacious comment that India didn’t gain true independence in 1947 is an insult to our freedom fighters, every single Indian citizen and an attack on our Constitution. pic.twitter.com/6sMhdxn3xA
— Rahul Gandhi (@RahulGandhi) January 15, 2025
Read Also: లద్దాఖ్ లో చైనా కాలుదువ్వుతోంది.. దాని కోరలు పీకాల్సిందే.. భారత ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన
కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సోనియా గాంధీ
ఢిల్లీలో నిర్మించిన నూతన కాంగ్రెస్ కార్యాలయం ఇవాళ ప్రారంభం అయ్యింది. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.
Read Also: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిరునామా.. 47 ఏళ్ల తరువాత మూతపడిన పాత కార్యాలయం