E-Paper
Advertisement

ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు.. లీకైన Samsung Galaxy S26 FE విశేషాలు!

ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు.. లీకైన Samsung Galaxy S26 FE విశేషాలు!
Advertisement

Samsung Galaxy S26 FE: శాంసంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Galaxy S26 Fan Edition (FE) ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అధికారికంగా విడుదల కాకముందే.. ఈ మొబైల్‌కు సంబంధించిన దాదాపు 26 ప్రోమో ఇమేజెస్ బయటకు వచ్చాయి. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగులు, కీలక ఫీచర్లపై ఒక స్పష్టత వచ్చేసింది. సెప్టెంబర్ ఆరంభంలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఆకట్టుకునే లుక్, డిజైన్:

తాజాగా లీకైన చిత్రాల ప్రకారం.. ఈ Samsung Galaxy S26 FE చాలా ప్రీమియం, క్లాసీ లుక్‌తో కనిపిస్తోంది. ప్లాట్ ఫ్రేమ్, సన్నని బెజెల్స్‌తో కూడిన డిస్‌ప్లే, స్క్రీన్ పైన చిన్న పంచ్ హోల్ కెమెరా ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక వైపు 3 కెమెరాల సెటప్ చాలా నీట్‌గా అమర్చారు. అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది గ్రాఫైట్, పిస్తాచియో, బ్లూబెర్రీ అనే మూడు అట్రాక్టివ్ కలర్స్‌లో లభించనుంది.

Advertisement

Also Read: భారత్‌లోకి Infinix Hot 70 Pro.. రూ.25,000 లోపు IP68 రేటింగ్, భారీ బ్యాటరీ ఫోన్!

కంపెనీ సొంత చిప్‌సెట్:

Samsung Galaxy S26 FE ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,900 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఇక ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. దీనిలో శాంసంగ్ సొంత ‘ఎక్సినోస్ 2500’ చిప్‌సెట్ వాడినట్లు సమాచారం. బడ్జెట్ ధరలోనే ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును ఇది అందిస్తుంది.

కెమెరా, బ్యాటరీ విశేషాలు:

Advertisement

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం Samsung Galaxy S26 FEలో అద్భుతమైన కెమెరా సెటప్ ఉంది. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 8MP టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 12MP కెమెరా ఉంది. ఇందులో 8K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కూడా అందించారు.

స్మార్ట్ ఏఐ ఫీచర్లు:

శాంసంగ్ ప్రీమియం ఫోన్లలో ఉండే సర్కిల్ టు సెర్చ్, ఆడియో ఎరేజర్, హారిజాన్ లాక్, మై ఫ్యాన్‌క్యామ్ వంటి అనేక అధునాతన ఏఐ ఫీచర్లను ఈ FE మోడల్‌లో కూడా అందిస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభూతిని కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Also Read: యూజర్లకు బిగ్ షాకిచ్చిన శాంసంగ్.. ఏకంగా రూ.12,000 పెరిగిన Galaxy S25 ధర, కొత్త రేట్లు ఇవే!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×