E-Paper
Advertisement

యూజర్లకు బిగ్ షాకిచ్చిన శాంసంగ్.. ఏకంగా రూ.12,000 పెరిగిన Galaxy S25 ధర, కొత్త రేట్లు ఇవే!

యూజర్లకు బిగ్ షాకిచ్చిన శాంసంగ్.. ఏకంగా రూ.12,000 పెరిగిన Galaxy S25 ధర, కొత్త రేట్లు ఇవే!
Advertisement

Samsung S25 Price Hike: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ Galaxy S25 కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే భారత మార్కెట్‌లో ఈ ఫోన్ ధరలను సైలెంట్‌గా పెంచేసింది. వేరియంట్‌ను బట్టి ఈ పెంపు గరిష్టంగా రూ.12,000 వరకు ఉంది. ఈ కొత్త ధరలు ఆగస్టు 19 నుంచే అమల్లోకి వచ్చాయి.

ఏ వేరియంట్ ధర ఎంత పెరిగిందంటే?

ఈ ధరల సవరణ ప్రభావం ప్రధానంగా 12GB ర్యామ్‌తో వచ్చే 256GB, 512GB స్టోరేజ్ మోడళ్లపై పడింది. ఇప్పటివరకు రూ.80,999కి లభించిన 12GB + 256GB వేరియంట్ ధర రూ.4,000 పెరిగి ఇప్పుడు రూ.84,999కి చేరింది. ఇక భారీ స్టోరేజ్ కలిగిన 12GB + 512GB వేరియంట్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దీని ధరపై ఏకంగా రూ.12,000 పెంపు పడటంతో.. పాత ధర రూ.92,999 నుంచి ఏకంగా రూ.1,04,999కి చేరుకుంది.

Advertisement

Also Read: ఇక హెడ్‌సెట్ అక్కర్లేదు.. గేమింగ్ కోసం Sony Pulse Elevate 3D ఆడియో స్పీకర్లు వచ్చేశాయ్!

ధరల పెంపునకు కారణం ఏంటి?

శాంసంగ్ అధికారికంగా స్పందించనప్పటికీ.. రీటైలర్లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌లు, ర్యామ్ విడిభాగాల కొరత తీవ్రంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విపరీతంగా పెరిగిపోవడంతో, దానికి కావలసిన డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ చిప్‌ల తయారీకి మెమరీ కాంపోనెంట్స్ వాడకం ఎక్కువైంది. దీంతో స్మార్ట్‌ఫోన్ విడిభాగాల తయారీ వ్యయం గణనీయంగా పెరిగింది.

కొనుగోలుదారులపై పడే ప్రభావం

Advertisement

సాధారణంగా ఫోన్ లాంచ్ అయిన కొన్ని నెలలకు ఆఫర్లు, డిస్కౌంట్లు రావడం చూస్తుంటాం. కానీ ఇలా లాంచ్ అయిన తర్వాత ధరలు పెరగడం వినియోగదారులకు మింగుడుపడని విషయమే. ఇప్పటికే కొన్ని మోడళ్ల ధరలను పెంచిన శాంసంగ్, ఇప్పుడు Galaxy S25ని కూడా ఆ జాబితాలో చేర్చింది. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారు ఇప్పుడు ఒకే రకమైన హార్డ్‌వేర్ కోసం వేల రూపాయలు అదనంగా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Also Read: రక్తంలోకి పోయే దుమ్మును కూడా పట్టుకుంటుంది.. షియోమీ నుంచి రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్!

Tags

Related News

లాంగ్ అవర్స్ వర్క్ చేసే..వారి కోసం బెస్ట్ ఐ-సేఫ్ మానిటర్స్

ఇక హెడ్‌సెట్ అక్కర్లేదు.. గేమింగ్ కోసం Sony Pulse Elevate 3D ఆడియో స్పీకర్లు వచ్చేశాయ్!

రక్తంలోకి పోయే దుమ్మును కూడా పట్టుకుంటుంది.. షియోమీ నుంచి రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్!

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

Big Stories

Advertisement
×