E-Paper
Advertisement

‘జూనియర్ అనుష్క’గా కామాక్షి.. ప్రొడ్యూసర్ మాట నిలబెడుతుందా?

‘జూనియర్ అనుష్క’గా కామాక్షి.. ప్రొడ్యూసర్ మాట నిలబెడుతుందా?
Advertisement

Kissik Talks:డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటూ ఎంతోమంది సెలబ్రిటీలు చెబుతూ ఉంటారు. అయితే డాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తూనే ఇటు సినిమా మీద మక్కువతో చైనా నుండి ఇండియాకు వచ్చి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  అత్యద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన గుర్తింపు రావడానికి పదేళ్లు పట్టింది అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ డైరెక్టర్ ఎంఎస్ రాజు (MS Raju) దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అగధ. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

‘జూనియర్ అనుష్క’గా కామాక్షి భాస్కర్ల..

ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కామాక్షి భాస్కర్ల నటనకు కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె.. తనకు వచ్చిన జూనియర్ అనుష్క(Junior Anushka) అనే బిరుదుపై స్పందించింది. హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా అగధ పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేము విన్నాము “జూనియర్ అనుష్క” అని పేరు కూడా వచ్చిందని అంటూ అడిగింది.

బిరుదుపై స్పందించిన కామాక్షి

Advertisement

కామాక్షి భాస్కర్ల దీనిపై స్పందిస్తూ.. “అగధ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ప్రముఖ ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అనుష్క తర్వాత మళ్లీ అలా అనిపించిన అమ్మాయి కామాక్షి అని చెప్పారు. శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. “నేను అరుంధతి సినిమాను అనుష్కతో చేస్తున్నప్పుడు ఆమె ఇండస్ట్రీకి కొత్త.. ఆమె నటనను నేను చూశాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి బలమైన పాత్రను క్యారీ చేయగలిగిన అమ్మాయి కామాక్షి” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఒక బలమైన పాత్రను మోయటంలో అనుష్క తర్వాత కామాక్షి.. అంతటి పేరును ఏకంగా బడా ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుండి సొంతం చేసుకోవడం నిజంగా ప్రశంసనీయం.

ALSO READ:ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

భయాన్ని కూడా బయటపెట్టిన కామాక్షి..

Advertisement

ఇకపోతే తనకు జూనియర్ అనుష్క పేరు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన కామాక్షి.. నా జీవితంలో వచ్చిన అతిపెద్ద కాంప్లిమెంట్ అదే..  అయితే ఏదైనా తేడా కొట్టిందంటే మాత్రం అంటూ తన భయాన్ని కూడా బయటపెట్టింది.

వెస్ట్ గోదావరి నుండి చైనా వరకు..

వెస్ట్ గోదావరి ఏలూరులో పుట్టిన కామాక్షి.. చైనాకు వెళ్లి డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా భాష రాదు.. సైగలతోనే నా అభిప్రాయాలను ఇతరులతో పంచుకునేదాన్ని అంటూ కామాక్షి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే డాక్టర్గా తన వృత్తిని కొనసాగిస్తూనే ఇటు సినిమాలలో కూడా రాణించడంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×