OTT Movie : అర్దరాత్రి ఆరుబయట అడుగు పెట్టాలంటేనే చాలామంది భయపడతారు. కొంచం ధైర్యం ఉన్నవాళ్ళు అలా రోడ్ల మీద తిరగడానికి ధైర్యం చేస్తారు. కానీ అదే హాంటెడ్ రోడ్లపై తిరిగే సాహసం మాత్రం ఎవ్వరూ చేయరు. అలాంటి ఓ భయంకరమైన రోడ్లో జర్నీ చేస్తే ఏం జరిగింది? అనే స్టోరీ లైన్ తెరకెక్కిన ఓ హర్రర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ? ఏంటో తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘డ్రైవ్ బ్యాక్’ (Drive Back). ఒక పార్టీ నుండి తిరిగి వస్తున్న జంట, సడన్ గా షార్ట్ కట్ రోడ్డులో చిక్కుకుని, భయంకరమైన టైమ్ లూప్ అనుభవాలు, వేటాడే హంతకుడి బారిన పడతారు. “డ్రైవ్ బ్యాక్” 2024లో విడుదలైన అమెరికన్ హారర్-థ్రిల్లర్ చిత్రం. సైకలాజికల్ హారర్, టైమ్-లూప్ మిస్టరీ వంటి జానర్లను మిక్స్ చేసి తీసిన సినిమా. స్క్రీమ్‌ఫెస్ట్ హారర్ ఫిల్మ్ ఫెస్టివల్, పాప్‌కార్న్ ఫ్రైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి జానర్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది.
ఈ చిత్రంలో జాక్ గోల్డ్ (రీడ్), విట్ కున్షిక్ (ఒలివియా), మడోన్నా యంగ్ మాగీ (వృద్ధ మహిళ), రాబర్ట్ లూయిస్ స్టీఫెన్సన్ (రీడ్ తండ్రి), జిమ్ టక్ (హిచ్‌హైకర్/హంతకుడు), క్రిస్టల్ ఫోస్టర్ (చిన్న అమ్మాయి), ఆలన్ డోర్ఫ్‌మైర్ నటించారు. “డ్రైవ్ బ్యాక్” 2024 నవంబర్ 8న లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.
Read Also : అమ్మాయిలను టచ్ చేయకుండానే అత్యంత కిరాతకంగా చంపే సైకో… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్
కథలోకి వెళ్తే…
రీడ్ (జాక్ గోల్డ్) ఒక కామిక్ ఆర్టిస్ట్. అతని భార్య ఒలివియా (విట్ కున్షిక్) గర్భవతి కావడంతో, ఆమె తల్లిదండ్రుల క్యాబిన్‌లో పార్టీ జరుపుకుని, తిరిగి ఇంటికి వెళతారు. రీడ్ తన తండ్రి (రాబర్ట్ లూయిస్ స్టీఫెన్సన్) వల్ల కలిగిన గత మానసిక గాయాల కారణంగా, అతనితో పెద్దగా మాట్లాడాడు. ఆ ఎఫెక్ట్ ఈ దంపతుల లైఫ్ పై కూడా పడుతుంది. అలా వెళ్తుండగా, ఒక స్పీడింగ్ ట్రక్‌తో దాదాపు యాక్సిడెంట్ అయిన తర్వాత, వారు “ఐ ఫర్‌గాట్ స్టోర్” అనే విచిత్రమైన స్టోర్‌లో ఒక వృద్ధ జంట (మడోన్నా యంగ్ మాగీ, ఆలన్ డోర్ఫ్‌మైర్)ను కలుస్తారు. అక్కడ వృద్ధ మహిళ వారిని ఒక షార్ట్‌కట్ రోడ్డుకు పంపుతుంది. ఈ రోడ్డు వారిని ఒక అంతులేని, టైమ్ లూప్‌లో చిక్కుకునేలా చేస్తుంది. ఇక్కడ వారు వింతైన దృశ్యాలను చూస్తారు. అలాగే అసలేం జరిగిందో, జరుగుతుందో వాళ్ళకు అస్సలు గుర్తు ఉండదు. ఒక హుడెడ్ హంతకుడు (జిమ్ టక్) వాళ్ళను చంపడానికి ప్రయత్నిస్తాడు. అలాగే వాళ్ళు ఫ్యూచర్ ను కూడా చూడగలుగుతారు. తమ ఫ్యూచర్లో ఈ జంట చూసింది ఏంటి? ఆ రోడ్డు నుంచి ఎలా బయట పడ్డారు? అసలు ఈ టైమ్ లూప్ లో ఆ హంతకుడు ఏం చేస్తున్నాడు? అన్నది తెరపై చూడాల్సిందే.