E-Paper
Advertisement

టెక్ వరల్డ్‌లో శాంసంగ్ సంచలనం.. ఒకేసారి 4 కొత్త ఫోల్డబుల్ ఫోన్లు, లాంచ్ ఎప్పుడంటే?

టెక్ వరల్డ్‌లో శాంసంగ్ సంచలనం.. ఒకేసారి 4 కొత్త ఫోల్డబుల్ ఫోన్లు, లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Samsung Foldable Phones: టెక్ ప్రపంచంలో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మార్కెట్లో రకరకాల మోడళ్లతో ఆకట్టుకున్న ఈ కొరియన్ టెక్ దిగ్గజం.. త్వరలోనే మరిన్ని వినూత్న డిజైన్లతో మన ముందుకు రాబోతోంది. ముఖ్యంగా 2027 సంవత్సరం శాంం‌సంగ్ అభిమానులకు నిజంగా ఒక పండుగలా మారబోతోందని సమాచారం.

ఒకేసారి నాలుగు ఫోల్డబుల్స్..

2027లో శాంసంగ్ ఏకంగా 4 కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ లీకర్ అందించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో Galaxy Z Fold 9, Galaxy Z Fold 9 Ultra, Galaxy Z Flip 9తో పాటు నెక్స్ట్ జనరేషన్ Tri-fold మోడల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లన్నీ 2027 జులై నాటికి లాంచ్ అయ్యే అవకాశాలు కనిపపిస్తున్నాయి.

Advertisement

Also Read: 1200mAh బ్యాటరీ, IP52 రేటింగ్‌తో వస్తున్న కొత్త HMD 4G ఫోన్.. ధర కూడా తక్కువే!

మరింత మెరుగైన డిజైన్, టెక్నాలజీ..

గతంలో వచ్చిన మొదటి తరం Tri-fold మోడల్ పెద్ద స్క్రీన్‌తో అలరించినప్పటికీ.. మడతల దగ్గర గీతలు రావడం (స్క్రీన్ క్రీజెస్) వంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈసారి రాబోయే కొత్త మోడల్‌లో ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. దీంతో స్క్రీన్ మడతపడే చోట ఎలాంటి గీతలు కనిపించకుండా, డిస్‌ప్లే చాలా స్మూత్‌గా ఉండబోతోంది. అలాగే సింగిల్ హ్యాండ్ యూసేజ్ కూడా మునుపటి కంటే చాలా తేలికగా మారనుంది.

S సిరీస్‌లోనూ కొత్త మోడల్?

Advertisement

కేవలం ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే కాకుండా.. ఫ్లాగ్‌షిప్ S సిరీస్‌లోనూ శాంసంగ్ ఒక పెద్ద మార్పు చేయబోతోంది. ప్రతి ఏటా మొదటి రెండు నెలల్లో S సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడం శాంసంగ్‌కు అలవాటు. అయితే 2027 ఆరంభంలో Galaxy S27 సిరీస్‌తో పాటు కొత్తగా Pro మోడల్‌ను కూడా పరిచయం చేసే ఆలోచనలో కంపెనీ ఉందట. ఫోల్డబుల్స్ వైపు మొగ్గు చూపుతున్న వినియోగదారుల కోసం కంపెనీ చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజమైతే.. 2027 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ రికార్డ్ సృష్టిస్తుంది.

Also Read: బడ్జెట్‌ ధరలో ఇంట్లోనే 200 అంగుళాల సినిమా హాల్.. మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ 14 ప్రొజెక్టర్!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×