E-Paper
Advertisement

బడ్జెట్‌ ధరలో ఇంట్లోనే 200 అంగుళాల సినిమా హాల్.. మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ 14 ప్రొజెక్టర్!

బడ్జెట్‌ ధరలో ఇంట్లోనే 200 అంగుళాల సినిమా హాల్.. మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ 14 ప్రొజెక్టర్!
Advertisement

XElectron Techno Plus: ప్రస్తుతం సినిమా థియేటర్‌కు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో ఇంట్లోనే పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూస్తూ హోమ్ థియేటర్ ఫీలింగ్ పొందాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే పెద్ద సైజు స్మార్ట్ టీవీలు కొనాలంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ XElectron.. ఒక అద్భుతమైన ప్రొజెక్టర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం రూ.8,499కే Techno Plus పేరుతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్ ప్రొజెక్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

200 అంగుళాల భారీ స్క్రీన్..

ఈ ప్రొజెక్టర్ ద్వారా ఇంట్లోనే ఏకంగా 200 అంగుళాల వరకు బిగ్ స్క్రీన్ అనుభవాన్ని పొందవచ్చు. ఇది ఫుల్ హెచ్‌డీ (1080p) రిజల్యూషన్‌తో వస్తుంది. అంతేకాకుండా 4K కంటెంట్‌ను కూడా ప్లే చేయగలదు. 9000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్, 5000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండటం వల్ల విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో వాడిన ఎల్‌ఈడీ లైట్ లైఫ్ దాదాపు 50,000 గంటల వరకు వస్తుందని కంపెనీ చెబుతోంది.

Advertisement

Also Read: ఫ్లాగ్‌షిప్ ఫోన్ల రేంజ్‌కు OPPO Reno 16 5G ధర.. భారీగా పెరిగిన విడిభాగాల భారం!

సీలింగ్‌పైనా చూడొచ్చు..

ఈ ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీని డిజైన్ 180 డిగ్రీల వరకు తిరుగుతుంది. అంటే.. ఈ ప్రొజెక్టర్ ద్వారా కేవలం ఎదురుగా ఉన్న గోడపైనే కాకుండా, పడుకుని పైన ఉన్న సీలింగ్‌పై కూడా ప్రొజెక్ట్ చేసి సినిమాలు చూసేయొచ్చు. ఇమేజ్ సరిగ్గా బాక్స్ షేప్‌లో అడ్జస్ట్ అవ్వడానికి ఇందులో ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్ కూడా ఉంది.

ఇన్‌బిల్ట్ OTT యాప్స్..

Advertisement

ఈ ప్రొజెక్టర్ నేరుగా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి టీవీ స్టిక్స్ వాడాల్సిన పనిలేదు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను నేరుగా ఇందులో వాడేసుకోవచ్చు. సౌండ్ కోసం దీనిలో బేస్ స్పీకర్ కూడా ఉంది. ఆడియో ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బ్లూటూత్ 5.0 ద్వారా సౌండ్ బార్ లేదా హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.

అందుబాటు ధరలో బెస్ట్ ఆప్షన్..

వైఫై 6 సపోర్ట్, తెలుగుతో సహా 25 భాషల ఆప్షన్లు, ఏడాది వారంటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అతి తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ బిజినెస్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ కోరుకునేవారికి ఇది మంచి ఛాయిస్. ఈ ప్రొజెక్టర్ ప్రస్తుతం అమెజాన్, ఎక్స్‌ఎలెక్ట్రాన్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Also Read: బాబోయ్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.26,500 దాకా తగ్గింపా? అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ డీల్!

Tags

Related News

చిన్న ఫ్యామిలీ, ఆఫీసులకు పర్ఫెక్ట్.. తక్కువ ధరలో బెస్ట్ మోడల్

రూ.15వేలలోపే అదిరిపోయే టీవీ.. థామ్సన్ నుంచి సూపర్ మోడల్!

లుక్ అదుర్స్..వర్క్ నెక్స్ట్ లెవెల్! ఫోన్‌తో.. కంట్రోల్ చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్

రూ.1,999లకే అద్భుతమైన ఫీచర్లు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై ఓ లుక్కేయండి

కరెంట్ సబ్ స్టేషన్ లో కంకర ఎందుకు పరుస్తారు? ఇదీ అసలు కథ!

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే.. 5 మైక్రోవేవ్ ఆప్షన్స్!

రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

మూవీ లవర్స్ కోసం క్రేజీ గాడ్జెట్..ఈ ప్రొజెక్టర్ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ !

Big Stories

Advertisement
×