Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంతేకాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని నేషనల్ అవార్డును కూడా అందుకొని.. నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను సైతం కొల్లగొట్టి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు అల్లు అర్జున్. అంతేకాదు ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో బన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు సగానికి పైగా కలెక్షన్స్ కేవలం నార్త్ నుండే రావడంతో బన్నీ దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే పడిందని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ తదుపరి చిత్రాలు..
ఇకపోతే పుష్ప2 సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్(Allu Arjun) ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas) తో కలిసి ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘అలవైకుంఠపురం లో’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుండడంతో అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ఏప్రిల్ లో పట్టాలెక్కనుంది. ఈ సినిమా హిస్టారికల్ వారియర్ “చెంఘీజ్ ఖాన్” జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇదే కాకుండా ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనికి తోడు “పుష్ప 3 – ది ర్యాంపేజ్” సినిమా కూడా చేయాలి.
బాలీవుడ్ బడా డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ..
అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగానే.. బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్థాయి అటు టాలీవుడ్ హీరోల ఆలోచనలకు కూడా అందనిది అని చెప్పవచ్చు. బాలీవుడ్లో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) తో అల్లు అర్జున్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన మార్క్ గ్రాండ్ స్కేల్లో సంజయ్ లీల గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించారు. గొప్ప కథనాలతో భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకరిగా పేరు కూడా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి. సిల్వర్ స్క్రీన్ అనే కాన్వాస్ పై ఆయన చిత్రాలన్నీ గొప్ప కావ్యాలే అని చెప్పవచ్చు. ఇలాంటి సంజయ్ లీల తో అల్లు అర్జున్ సినిమా అంటే ఇండస్ట్రీలు సైతం భయపడతాయి ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియాలి అంటే, మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. మొత్తానికైతే ఈ సినిమాల లెక్క ప్రకారం చూసుకుంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు మార్మోగటం ఖాయమని చెప్పవచ్చు.