భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూ భ్రమణం అంటారు. ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడానికి అంటే భూమి ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలం ఒక రోజు లేదా 24గంటలు. సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే 23 గంటల 56 నిమిషాల, 4.09 సెకన్లు మాత్రమే. ఆ మిగిలిన టైమ్ ని లెక్కగడితే నాలుగేళ్లకోసారి అది 24గంటలకు చేరుతుంది. అందుకే నాలుగేళ్లకోసారి లీప్ ఇయర్ లో మనం ఫిబ్రవరి నెలకు ఒకరోజు కలిపి 29 నెలలుగా లెక్కగడతాం. సో.. ఇక్కడ భూ భ్రమణానికి పట్టే కరెక్ట్ సమయం 23 గంటల 56 నిమిషాల, 4.09 సెకన్లు. ప్రతి రోజూ ఇంతే ఉంటుందా అంటే ఈ సమయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. దానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాడు. కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాడు, మరికొన్నిసార్లు దూరంగా వెళ్తాడు. ఇలా చంద్రుడు భూమికి దూరంగా వెళ్లిన సమయంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిపై తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో భూమి వేగం కాస్త పెరుగుతుంది. అలా పెరగడం వల్ల భూమి తన చుట్టూ తాను తిరిగే(భ్రమణ) సమయం తక్కువ అవుతుంది. జులై-9న అంటే ఈరోజు అదే జరిగింది. భూమి వేగం కాస్త పెరిగింది. ఫలితంగా భూ భ్రమణ సమయంస స్వల్పంగా తగ్గింది. సాధారణ రోజు కంటే భ్రణ సమయం 1.3 మిల్లీ సెకన్ల నుంచి 1.51 మిల్లీసెకన్ల మధ్య తగ్గినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరో రెండు రోజులు..
భూ భ్రమణ వేగాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. భూమి తిరిగే అక్షం, సూర్యుడికి భూమికి మధ్య మారే దూరం, చంద్రుడి ఆకర్షణ బలాలు.. ఇలా అన్ని అంశాలతో ఇది ముడిపడి ఉంటుంది. అయితే ఈసారి ఈ అంశాల ప్రభావం ఒకేసారి రావడంతో భూమి వేగం స్వల్పంగా పెరిగింది. అలా పెరగడం వల్ల భూ భ్రమణ కాలం స్వల్పంగా తగ్గింది. ప్రతి ఏడాదీ జరిగేదే అయినా.. ఈసారి అది గుర్తించదగ్గ స్థాయిలో ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. చరిత్రలోనే 2025 జులై-9 కి ప్రత్యేకత ఇచ్చిందని చెబుతున్నారు. ఈ ఏడాది మరో రెండురోజులు కూడా భూమి ఇలాగే భ్రమణ వేగాన్ని పెంచుకుంటుంది. ఈనెల 22, ఆగస్ట్ 5 తేదీల్లో భూ భ్రమణ వేగం పెరుగుతుందని, భ్రమణ కాలం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నెగటివ్ లీప్ సెకండ్
ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (IERS) ఈ దృగ్విషయాన్ని ధృవీకరించింది. గ్లోబల్ టైమ్ కీపింగ్ ను IERS పర్యవేక్షిస్తుంది. భూ భ్రమణ కాలాన్ని పరిగణలోకి తీసుకుని లీప్ సెకండ్స్ ని రోజుకి కలుపుతారు. అలా నాలుగేళ్లకోసారి లీప్ ఇయర్ లో ఒక రోజుని కలుపుతారు. ఇప్పుడు జరిగేది దీనికి రివర్స్ అనమాట. అంటే భూ భ్రమణ వేగం పెరిగి సమయం తగ్గుతుంది. దీన్ని సర్దుబాటు చేయడానికి “నెగటివ్ లీప్ సెకండ్”ను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అలా నెగెటివ్ లీప్ సెకండ్ ని ప్రవేశపెట్టి మిల్లీ సెకన్స్ ని తీసివేయడం ఇదే తొలిసారి అవుతుంది. ఇది అపూర్వమైన పరిస్థితి అని, అంతరిక్ష చరిత్రలోనే ఇది పెద్ద విషయం అని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీలో జియోఫిజిసిస్ట్ గా పనిచేస్తున్న డంకన్ ఆగ్న్యూ వెల్లడించారు. అయితే భూ భ్రమణంలో కనిపించిన ఈ స్వల్ప మార్పు వల్ల విపత్తులేవీ సంభవించవని ఆయన తెలిపారు. కానీ ఇది గుర్తించదగిన విషయం అని అంటున్నారాయన.