Bigg Boss telugu 9: బుల్లితెర పై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇక తెలుగులో ఇప్పటికీ ఎనిమిది సీజన్లో పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తొమ్మిదవ సీజన్ కూడా త్వరలోనే ప్రసారం కాబోతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ తో బిగ్ బాస్ నిర్వహకులు ఈ కార్యక్రమం పై మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్(contestant) ల గురించి రోజుకి ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా శివ్…
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా బుల్లితెర నటుడు శివకుమార్(Shiva Kumar) కూడా పాల్గొంటున్నారని ఈయన పేరు కూడా వినిపించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకుమార్, ప్రియాంక జైన్ (Priyanka Jain) బిగ్ బాస్ కార్యక్రమం పై స్పందించారు. బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారంటూ వార్తలు వచ్చాయి నిజమేనా? అంటూ ప్రశ్న ఎదురు కావడంతో వెంటనే ప్రియాంక నేనైతే శివ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని చాలా కోరుకుంటున్నాను అని తెలిపారు.
నా సీరియల్ కు మంచి రేటింగ్ ఉంది..
ఇక ఈ విషయం గురించి శివకుమార్ మాట్లాడుతూ.. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నానంటూ వార్తలు వస్తున్నాయి. నేను కూడా ఆ వార్తలను విన్నాను అయితే ఇప్పటివరకు నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనమని బిగ్ బాస్ టీం ఎవరు కూడా సంప్రదించలేదని ఈయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం తాను స్టార్ మా లో నటిస్తున్న నిన్ను కోరి(Ninnukori) సీరియల్ కూడా చాలా అద్భుతమైన రేటింగ్స్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అందుకే తాను ప్రస్తుతం వెళ్లాలని అనుకోలేదు, ఈ సీజన్ కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు కానీ లాస్ట్ రెండు సీజన్లో కోసం అయితే కాంటాక్ట్ అయ్యారని శివకుమార్ తెలిపారు.
గత రెండు సీజన్లకు అవకాశం…
ఇలా నా సీరియల్ మంచి రేటింగ్ వస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనుకోలేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రియాంక మాత్రం నాకైతే శివ్ ను హౌస్ లోకి పంపించాలని చాలా ఉంది అంటూ తన మనసులో మాట బయటపెట్టారు. వీరిద్దరి మాటలు బట్టి చూస్తుంటే శివకుమార్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనలేదని స్పష్టమవుతుంది. ఇక ప్రియాంక, శివకుమార్ ఇద్దరూ మౌనరాగం (Mounaragam)సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ తో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా, ఈ సీరియల్ సమయంలోనే ప్రేమలో పడటం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో అసలు వీరిది నిజమైన ప్రేమేనా? లేదంటే యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఇలా ప్రేమికులుగా నటిస్తున్నారా? అంటూ ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా నేరుగా వీరిని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాము త్వరలోనే పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము అంటూ పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తూ వస్తున్నారు.
Also Read: Tammareddy Bharadwaj: ఫిష్ వెంకట్‌కు డబ్బులు అందుకే ఇవ్వట్లేదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్