E-Paper
Advertisement

China Compound:గ్రహశకలాలను గమనించే ‘చైనా కంపౌండ్ ఐ’..

China Compound:గ్రహశకలాలను గమనించే ‘చైనా కంపౌండ్ ఐ’..
Advertisement

China Compound:సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చైనా.. ఇతర దేశాల సాయం లేకుండా ముందుకు దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. దానికి తగిన ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇప్పటికే పలు టెలిస్కోప్‌లను సొంతంగా తయారు చేసుకున్న చైనా.. 2023లో మరికొన్ని టెలిస్కోప్‌లు తయారు చేయాలని అనుకుంటోంది. అంతే కాకుండా రాడార్ టెక్నాలజీని కూడా తయారు చేయడానికి చైనా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

చైనా కంపౌండ్ ఐ పేరుతో చైనా ఒక స్పేస్ అబ్జర్వేషన్ రాడార్‌ను తయారు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ రాడార్ తయారీ మొదటి ఫేజ్‌ను పూర్తి చేసుకొని రెండో ఫేజ్‌లోకి అడుగుపెట్టింది. బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. చాంగ్కింగ్‌లో చైనా కంపౌండ్ ఐ రెండో ఫేజ్ తయారీ ప్రారంభమయినట్టుగా ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. 20 హెక్టార్లలో 25 హై రెజల్యూషన్ రాడార్లతో ఈ ఫేజ్ తయారు చేయబడుతోంది. 2025లోపు ఈ కంపౌండ్ ఐ తయారీ పూర్తవుతుందని చైనా భావిస్తోంది.

Advertisement

ఇప్పటికే అంతరిక్షంలోని నక్షత్రాలను, భూమిని, ఇతర గ్రహాలను గమనించడానికి, ఫోటోలు తీయడానికి ఎన్నో శాటిలైట్లు స్పేస్‌లో తిరుగుతూ ఉన్నాయి. అయితే వాటన్నింటికంటే సమర్థవంతంగా చైనా కంపౌండ్ ఐను తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. స్పేస్‌లో తిరిగే హై రెజల్యూషన్ ఉన్న కణాలను పరిశీలించడానికి, ఫోటోలు తీయడానికి ఇది ఉపయోగపడనుంది. ఇది సైన్స్ రీసెర్చ్ కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా గ్రహశకలాలు భూమిపై పడకుండా ఉండేలా చేస్తుందని వారు అంటున్నారు.

గ్రహశకలాల నుండి భూగ్రహాన్ని కాపాడాలంటే ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. అవి భూమిపై పడి విధ్వంసం సృష్టించకుండా దారి మార్చే టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. అయితే దానికోసం చైనా కంపౌండ్ ఐ పనిచేస్తుందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని మొదటి ఫేజ్ తయారీ గత డిసెంబర్‌లో పూర్తయ్యింది. అందులో 16 రాడార్‌లు అమర్చినట్టుగా తెలుస్తోంది. రెండో ఫేజ్ తయారీ పూర్తయిన తర్వాత మూడో ఫేజ్ తయారీ పూర్తయ్యేలోపు 100 రాడార్లతో చైనా కంపౌండ్ ఐ సిద్ధంగా ఉంటుంది. ఏదైనా గ్రహశకలం మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే గుర్తించే పరిజ్ఞానం చైనా కంపౌండ్ ఐలో అమర్చబడుతుందని చైనా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?

Technology:పక్షవాతం వచ్చినవారికి సాయం చేసే టెక్నాలజీ..

Advertisement

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×