E-Paper
Advertisement

విమాన టికెట్ ధరలు భారీగా పెరిగితే కేంద్రం జోక్యం.. కొత్త రూల్స్ ఇవే!

విమాన టికెట్ ధరలు భారీగా పెరిగితే కేంద్రం జోక్యం.. కొత్త రూల్స్ ఇవే!
Advertisement

India New Airfare Rules 2027: విమాన టికెట్ ధరల విషయంలో ఇకపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోనుంది.  విమాన ఛార్జీలు భారీగా పెరిగినప్పుడు లేదంటే అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, విమాన టికెట్లపై శాశ్వతంగా గరిష్ఠ ధరను మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. భారతీయ వాయుయాన్ నియమ్ 2026 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 31న అధికారిక గెజిట్‌లో వీటిని ప్రచురించారు.

అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం

కొత్త నిబంధనల్లోని రూల్ 192 ప్రకారం, అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం విమాన ఛార్జీల విషయంలో ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ ఆదేశాలు లిఖితపూర్వకంగా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా, నిర్దిష్ట కాలానికి మాత్రమే అమల్లో ఉండాలి. అయితే, అసాధారణ పరిస్థితులు అంటే ఏమిటో ఈ నిబంధనల్లో స్పష్టంగా నిర్వచించలేదు. అలాగే టికెట్ ధర ఎంత దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే గరిష్ఠ పరిమితిని కూడా నిర్ణయించలేదు.

టికెట్ ధరల్లో పారదర్శకత తప్పనిసరి!

Advertisement

కొత్త నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు టికెట్ ధరలను నిర్ణయించేటప్పుడు నిర్వహణ ఖర్చులు సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైన విమానయాన సంస్థలు తాము నిర్ణయించిన ఛార్జీల వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సమర్పించాలి. ఈ ధరలను DGCA పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో టికెట్ ధరలను అందుబాటులో ఉంచాలి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని స్పష్టంగా చూపించాలి.

పన్నులు, రద్దు ఛార్జీలు విడివిడిగా చూపించాలి!

టికెట్ ధరతో పాటు పన్నులు, ఇతర రుసుములు, టికెట్ రద్దు ఛార్జీలు, రీఫండ్‌కు సంబంధించిన షరతులను కూడా విమానయాన సంస్థలు విడివిడిగా వెల్లడించాలి. అదనపు సర్వీసులు, సౌకర్యాల కోసం వసూలు చేసే మొత్తాలను కూడా ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలి. దీనివల్ల టికెట్ బుక్ చేసుకునే ముందే మొత్తం ఖర్చు ఎంతవుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

విమాన ఛార్జీలపై ఎందుకు చర్చ?

Advertisement

విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుతున్నాయనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనలు వచ్చాయి. గతంలో 1994లో విమాన ఛార్జీలపై ప్రభుత్వ నియంత్రణలు తొలగించడంతో ధరలను నిర్ణయించే అవకాశం విమానయాన సంస్థలకు లభించింది. డిమాండ్, బుకింగ్ సమయం ఆధారంగా టికెట్ ధరలు మారుతూ వస్తున్నాయి.

కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, సాధారణ రోజుల్లో టికెట్ ధరలను విమానయాన సంస్థలే నిర్ణయిస్తాయి. సో, విమాన టికెట్ల ధరలు పూర్తిగా తగ్గుతాయని ఇప్పుడే చెప్పలేం. కానీ, ధరల విషయంలో పారదర్శకత పెరగడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వ జోక్యానికి మార్గం ఏర్పడనుంది.

Read Also: గంటకు 320 కిలో మీటర్ల వేగం.. సముద్రం కింద బుల్లెట్ రైలు ప్రయాణం!

Tags

Related News

కోనసీమలో తమిళ సంస్కృతి.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్చపోవాల్సిందే!

రైలు ఇంజన్ లేకుండానే.. పట్టాలు తప్పిన ఏడు ఖాళీ బోగీలు, తమిళనాడులో ఊహించని ఘటన

వారణాసి-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. సోమవారం నుంచే రెగ్యులర్ సర్వీసులు!

మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!

భారత బుల్లెట్ రైలుకు స్క్వీజ్ టెస్ట్.. ప్రమాదం జరిగినా బోగీలు చెక్కుచెదరవా?

గంటకు 320 కిలో మీటర్ల వేగం.. సముద్రం కింద బుల్లెట్ రైలు ప్రయాణం!

ఎండలు మండినా తరగని జలకళ.. దేవరకొండ కోటలో వింత కోనేరు!

Big Stories

Advertisement
×