BigTV English

Shocking Revelation: ప్రపంచంలోని వందలాది అగ్నిపర్వతాలు ఒకేసారి పేలబోతున్నాయా? తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Shocking Revelation: ప్రపంచంలోని వందలాది అగ్నిపర్వతాలు ఒకేసారి పేలబోతున్నాయా? తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

అగ్ని పర్వతాల పేలుడికి కారణం ఏంటి..?
అగ్నిపర్వతాలు బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల రసాయనిక మార్పులు అనేకం జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా అవి విస్ఫోటనం చెందుతాయి. నిద్రాణంలో ఉన్న అగ్నిపర్వతాల పేలుళ్లను ఎవరూ ఊహించలేరు, అంచనా వేయనూలేరు. అయితే కొన్ని అగ్ని పర్వతాలు తరచూ పేలుతూ ఉంటాయి. అలాంటి వాటి దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఒకవేళ ప్రపంచంలో ఉన్న అగ్ని పర్వతాలన్నీ ఒకేసారి పేలితే మాత్రం దాని వల్ల జరిగే నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేరు. కానీ అలాంటి ఉపద్రవం సంభవించడానికి సమయం ఎంతో దూరంలో లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, ఇది నిజం. వారి అంచనా కరెక్ట్ అయితే ప్రపంచంలోని అగ్నిపర్వతాలన్నీ ఒకేసారి పేలిపోతాయి.


హిమానీనదాలతో సంబంధం..

ప్రేగ్‌లో జరుగుతున్న జియో కెమిస్ట్రీ అంతర్జాతీయ సమావేశంలో ఈ అధ్యయనాన్ని బయటపెట్టారు. గోల్డ్‌స్చ్మిడ్ట్ సమావేశంలో అగ్నిపర్వతాల పేలుడుకి, హిమానీ నదాలు కరిగిపోవడానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. హిమానీ నదాలు కరిగిపోవడం మరీ వేగవంతం అయితే సముద్రమట్టాలు పెరిగిపోయి, భూమిమీద ఉన్న కొన్ని ప్రాంతాలు సముద్రగర్భంలో కలిసిపోతాయనే విషయం మనందరికీ తెలుసు. అయితే హిమానీ నదాలు కరిగిపోతే మరో పెను విపత్తు కూడా పొంచి ఉంది. అదే అగ్ని పర్వత విస్ఫోటనం. అయితే హిమానీ నదాలు, అగ్ని పర్వతాల విస్ఫోటనం మధ్య ఉన్న ఈ సంబంధం ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిందేమీ కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధంపై 1970లనుంచే అధ్యయనాలు జరుగుతున్నాయి. ఐస్ లాండ్ శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఈ దృగ్విషయంపై దృష్టిసారించారు.


వాతావరణంలో పెనుమార్పులు..

హిమానీ నదాల కింద కూడా అగ్నిపర్వతాలు ఉంటాయి. అయితే వాటి చల్లదనం వల్ల ఆ అగ్నిపర్వతాలు అణచివేయబడి ఉంటాయి. వాటి లోపల జరిగే రసాయన చర్యలకు పైన ఉన్న చల్లదనం అడ్డంకిగా మారుతుంది. అందుకే అవన్నీ నిద్రాణంలో ఉంటాయి. అయితే హిమానీ నదాలు అంతరించిపోతే వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ పెరిగిన ఉష్ణోగ్రతను అడ్డుకునే హిమానీ నదం కరిగిపోయి ఉంటుంది కాబట్టి.. అగ్నిపర్వతాల విస్ఫోటనానికి ఆ ఉష్ణోగ్రత ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అందుకే కరిగిపోతున్న హిమానీ నదాల కింద ఉన్న అగ్నిపర్వతాలు ఒక్కసారిగా పేలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2022లో ప్రచురించిన బులెటిన్ ఆఫ్ వోల్కనాలజీ జర్నల్‌ లో భారీ వర్షాలు, హిమానీనదాలు కరగడం వల్ల అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించవచ్చు అని తేల్చారు.

ఆ మూడు ప్రాంతాల్లో డేంజర్..

హిమానీనదాలు కరిగిపోవడం వల్ల అంటార్కిటికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు విస్ఫోటనానికి గురికావొచ్చు. ఇవి ముఖ్యంగా ఐస్ లాండ్, బ్రిటిష్ కొలంబియా, అంటార్కిటికాలో ఉన్నాయి. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అగ్నిపర్వతాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుందా అనే దిశగా అధ్యయనాలు జరుగుతున్నాయి. విస్ఫోటనాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందం డేటింగ్ సాధనాలను ఉపయోగిస్తోంది. వీటి ద్వారా హిమనదాల్లో మంచు ఫలకల బరువు, దాని పీడనం.. భూగర్భంలోని శిలాద్రవం లక్షణాలను ఎలా మారుస్తుందో అధ్యయనం చేస్తున్నారు. లావా బయటకు వచ్చిన తర్వాత భూమి అంతర్భాగం నుంచి బయటకు వచ్చిన స్ఫటికాలను కూడా విశ్లేషిస్తున్నారు.

ఒత్తిడి తగ్గితే అంతే..

హిమానీనదాలు వాటి కింద ఉన్న అగ్నిపర్వతాల నుండి విస్ఫోటనాల పరిమాణాన్ని అణిచివేస్తాయి. కానీ వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పైన మంచు ఫలకలు ఉండటం వల్ల దాని పీడనం కింద ఉన్న శిలాద్రవాన్ని నొక్కి పెడుతుంది. మంచు ఫలకలు అంతరిస్తే పీడనం తగ్గుతుంది. దీనివల్ల అగ్నిపర్వతాల్లో ఉన్న శిలాద్రవం పైకి ఎగజిమ్ముతుంది. దీంతో ఈ అగ్నిపర్వతాలు తరచుగా విస్ఫోటనం చెందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పేలుడు సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉందంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురైన ఒత్తిడే ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్ అంటున్నారు. ఇది ప్రస్తుతం అంటార్కిటికా వంటి ప్రదేశాలలో జరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

Expensive Phones: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

7000mAh Budget Phones: రూ 20000 లోపు ధరలో 7000mAh బ్యాటరీ ఫోన్లు.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఇవే..

Galaxy S25 FE vs iPhone 16e: రెండు బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య గట్టి పోటీ.. విన్నర్ ఎవరు?

Moto Book 60 Pro: మోటోరోలా కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌తో లాంచ్

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !

Big Stories

×