Dhaba Earns Rs 8 Cr: ఢిల్లీలో నివాసం ఉండే చాలా మందికి తరచుగా వినిపించే పేరు అమ్రిక్ సుఖ్ దేవ్ దాబా. చాలా మంది ఇక్కడికి వెళ్లి ఫుడ్ తినేందుకు ఇష్టపడుతారు. ఈ ఐకానిక్ దాబాలో ఒక్కసారి పరోటా తింటే జీవితాంతం మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటాయి. అందుకే, ఈ దాబా నిత్యం కస్టమర్లతో కిటకిటలాడుతుంది. ఈ దాబా ఆదాయం కూడా కళ్లు చెదిరేలా ఉంటుంది. ఇంతకీ ఈ దాబా రోజువారి కౌంటర్ ఎంత ఉంటుందంటే..
హర్యానాలో అమ్రిక్ సుఖ్ దేవ్ దాబా!
అమ్రిక్ సుఖ్ దేవ్ దాబా హర్యానాలో ఉంటుంది. NH-44ను ఆనుకుని ఉంటుంది. ఈ రెస్టారెంట్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ దాబా ఫుడ్ లవర్స్ అందరికీ డెస్టినేషన్ గా మారిపోయింది. అన్ని వయసుల వారు ఇక్కడి ఫుడ్ ను ఎంతో ఇష్టపడుతారు. ప్రతిరోజూ.. వేలాది మంది ఇక్కడి పరోటాలను ఆస్వాదిస్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో ఈ దాబా కస్టమర్లతో కళకళలాడుతుంది. నిత్యం లక్షల రూపాయాలు ఆదాయాన్ని పొందుతుంది.
ఏడాదికి రూ. 100 కోట్ల ఆదాయం
నిజానికి అమ్రిక్ సుఖ్ దేవ్ దాబా ఒకప్పుడు చిన్న రోడ్డు పక్కన ఉన్న దాబాగా ప్రారంభమైంది. రీసెంట్ గా రియల్ ఎస్టేట్, బిజినెస్ కు సంబంధించి కంటెంట్ ను పోస్ట్ చేసే రాకీ సగ్గూ క్యాపిటల్ అనే ఇన్ స్టాగ్రామ్ క్రియేటర్ అమ్రిక్ సుఖ్ దేవ్ దాబా ప్రయాణం గురించి ఓ వీడియో షేర్ చేశాడు. ఆయన లెక్కల ప్రకారం ఈ రెస్టారెంట్ ఏడాదికి సుమారు రూ. 100 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. అమ్రిక్ సుఖ్ దేవ్ రోజుకు 5,000 నుంచి 10,000 మంది కస్టమర్లకు ఫుడ్ సర్వీసులు అందిస్తుంది. ఇందులో 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
1956లో సర్దార్ ప్రకాష్ సింగ్ ముర్తల్ లో ఒక చిన్న ధాబాను ప్రారంభించారు. అప్పట్లో, పప్పు, రోటీ, సబ్జీ, చావల్ లాంటి భోజనాలు అందించేది. హైవే గుండా వెళ్ళే ట్రక్ డ్రైవర్లు ఇక్కడ మంచాల మీద కూర్చొని భోజనాలు చేసేవారు. 1990లో అతడి కుమారులు అమ్రిక్, సుఖ్ దేవ్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. వారు తమ తండ్రితో కలిసి పనిచేయడం ప్రారంభించారు. నెమ్మదిగా ఈ దాబాను విస్తరించారు. అలాగే మెనూను కూడా పెంచారు. ఇప్పుడు, ఈ దాబా నార్త్ ఇండియన్ ఫుడ్ తో పాటు సౌత్ ఆప్షన్స్ ను అందిస్తున్నది.
ఈ దాబాకు ఎందుకు అంత ప్రచారం లభించింది?
అమ్రిక్, సుఖ్ దేవ్ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు మూడు కీలక అంశాలను బేస్ చేసుకున్నారు. మొదటిది దాబా యజమానులు కస్టమర్లతో నమ్మకాన్ని బాగా పెంచుకున్నారు. ట్రక్, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత లేదంటే రాయితీ ఆహారాన్ని అందించేవారు. ఈ నిర్ణయం నమ్మకమైన కస్టమర్ బేస్‌ను ఏర్పరచడంలో సహాయపడింది. రెండోది హోం ఫుఈ దాబా యజమానులు కొత్త వంటకాన్ని మెనూలో చేర్చే ముందు రుచి చూస్తారు. బాగుంది అనుకుంటేనే యాడ్ చేస్తారు. మూడోది వేగం. ఈ దాబాలో 150 టేబుళ్లు ఉంటాయి. ప్రతి రోజు దాదాపు 9,000 మంది కస్టమర్లకు సర్వీసు అందిస్తుంది. ఈ దాబా అద్భుతంగా సక్సెస్ అయినప్పటికీ, ఏనాడు యాడ్స్ మీద దృష్టి పెట్టలేదు. కేవలం నోటి మాట ద్వారానే ఈ బిజినెస్ అభివృద్ధి చెందింది. ఈ దాబా టేస్ట్ అట్లాస్ ‘ప్రపంచంలోని 100 అత్యంత ఐకానిక్ రెస్టారెంట్లు’ జాబితాలో స్థానం సంపాదించింది.
Read Also: ఆ గ్రామంలో కాలనీలన్నీ గుండ్రంగా ఉంటాయి.. మీరూ అక్కడ స్టే చేయొచ్చు!