Big Stories

New Feature in WhatsApp: వాట్సప్ నుంచి క్రేజీ ఫీచర్.. 30 సెకన్లు కాదు.. ఇక నుండి స్టేటస్ నిమిషం పెట్టొచ్చు!

WhatsApp
WhatsApp Update

1 min Status in WhatsApp: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్న పిల్లాడి వరకు స్మార్ట్ వాడుతున్నారు. ఈ స్మార్ట్ ‌ఫోన్లలో వివిధ యాప్స్ విపరీతంగా ఉంటాయి. ఇందులో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది. వాట్సాప్ లేకుండా ఏ స్మార్ట్‌ఫోన్ ఉండదు. మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయంటే.. అందులో వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా వీడియో కాల్స్, మేసేజేస్, డాక్యుమెంట్స్ సెండ్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు భారీ డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను తీసుకొస్తుంది. కొన్ని రోజులో క్రితమే చాట్ ఫిల్టర్, స్క్రీన్ షాట్ బ్లాక్ వంటి సెక్యురిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా ఇన్‌స్టట్ మెజేసింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ మరొకొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఒక నిమిషం వీడియోలను వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేసే ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Also Read: ఓ మైగాడ్.. ఇయర్ బడ్స్‌పై 50 శాతం డిస్కౌంట్!

వాట్సాప్‌ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వినియోగదారులు 1 నిమిషం వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి 30 సెకనుల వీడియో మాత్రమే స్టేటస్‌లో అప్‌లోడ్ అవుతుంది. వాట్సాప్ ప్రారంభం నుంచే ఇది అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తుందని సంస్థ భావిస్తోంది. స్టేటస్ అప్‌లోడ్ సమయం పెంచడం ద్వారా ఎక్కువగా వీడియోలు కట్ అవకుండా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సంస్థ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి సరికొత్త వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను అందుబాటులో ఉంచింది. ఈ అప్‌డేట్ ద్వారా వీడియోలను 1 నిమిషం వ్యవధిలో అప్‌లోడ్ చేయొచ్చు. కానీ ఇది సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వీరు మాత్రమే ఆ ఫీచర్‌ను ఉపయోగించుకోగలరు. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది. స్టేటస్‌లో అందరూ కూడా ఒక నిమిషం వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చు. దీని ద్వారా పొడవాటి వీడియోలను స్టేటస్‌లో‌గా పెట్టొచ్చు.

Also Read:  గార్మిన్ వాచెస్‌పై భారీ సెల్.. ఏకంగా సగం రేటుకే అమ్మకం

అంతేకాకుండా వాట్సాప్ త్వరలో యూపీఐపై ఫోకస్ చేయనుంది. వాట్సాప్ పేమెంట్స్ సులభంగా చేసే ఫీచర్‌ను తీసుకురానుంది. పేమెంట్స్ ‌కోసం క్యూ ఆర్ కోడ్‌ను చాట్ ట్యాబ్ నుంచి నేరుగా ఇతరులకు సెండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పేమేంట్స్ చేయాలంటే సెట్టింగ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. రానున్న అప్‌డేట్‌‌లో ఇది సులభతరం కానుంది. మీరు మీ క్యూఆర్ కోడ్‌ను షేర్ చేసినప్పుడు వాట్సాప్ మీ ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్ నేమ్‌ను చూపిస్తుంది. ఇటువంటి ఫ్రెండ్లీ ఫీచర్లతో వాట్సప్ రికార్డ్ సృష్టిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News