BigTV English

Telangana RTC: చీలిన ఆర్టీసీ సంఘాలు.. సీఎం రేవంత్ సూచన.. అసలేం జరిగింది?

Telangana RTC: చీలిన ఆర్టీసీ సంఘాలు.. సీఎం రేవంత్ సూచన.. అసలేం జరిగింది?

Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మాటేంటి? సీఎం రేవంత్‌రెడ్డి సూచనతో ఆర్టీసీ సంఘాలు రెండుగా చీలిపోయారా? రాజకీయ పార్టీలు కావాలనే ఉద్యోగులను రెచ్చగొట్టాయా? ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయలేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు దీని వెనుక అసలేం జరుగుతోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.


ఆర్టీసీ సమ్మె వెనుక ముమ్మాటికీ రాజకీయ నేతలు ఉన్నారని అంటున్నారు.  ప్రభుత్వం ఏర్పడి కేవలం 15 నెలలు మాత్రమే అయ్యిందని, ఈలోగా సమ్మె చేయడం కరెక్టు కాదన్నది కొన్ని సంఘాల ఉద్యోగుల మాట.  ఇంతకీ సమ్మెకు దారి తీసిన కారణాలేంటి?  అన్నదానిపై కొన్ని పాయింట్లు పరిశీలిద్దాం.

1. తమ డిమాండ్లు తీర్చకుంటే సమ్మెకు వెళ్తామన్నది ఉద్యోగుల మాట. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆపై 21 డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించాయి


2. సమ్మె వద్దని చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది. తమ డిమాండ్లు అంగీకరించకుంటే సమ్మెకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు ఉద్యోగులు.

ALSO READ: మళ్లీ హైదరాబాద్ మెట్రోలో సమస్య, ఎక్కడికక్కడ మెట్రో స్టాప్

3. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించాలన్నది ప్రభుత్వం ఆలోచన. సమ్మె వల్ల సంస్థతోపాటు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని అధికారుల మాట.

4. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే రాజకీయ కుట్రలో భాగం కావద్దని ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన. ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలన్నారు.

5. రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఉన్నాయని, సమ్మె చేస్తే దివాళా తీస్తుందని చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల చేతుల్లో పావులు మారవద్దన్నది సీఎం మాట.

6.  సమ్మె నోటీసుకు ముందు ఉద్యోగ సంఘాల నేతలు వివిధ రాజకీయ పార్టీలను కలిసినట్టు ప్రచారం సాగుతోంది. ఆ పార్టీలు ఇచ్చిన సలహా మేరకు సమ్మె నోటీసు ఇచ్చిందనే ప్రచారం లేకపోలేదు.

7. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు గొప్పలు చెప్పింది. ప్రస్తుతం ఉద్యోగులు మాత్రం తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎందుకంటున్నారు? అన్నది అసలు ప్రశ్న.

8.  బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ఆర్టీసీ బిల్లును ఆమోదముద్ర వేయకుండా గవర్నర్ తమిళసై పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు. గవర్నర్‌‌తో అప్పటి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించడమే కారణమని కొందరు ఉద్యోగుల మాట.

9. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఏదో విధంగా ఇబ్బంది పెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  రెండు లేదా మూడు నెలలకు తెరపైకి కొత్త కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ వంతైందని అంటున్నారు కొందరు నేతలు.

10. సమ్మెకు దూరంగా ఉంటున్నామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ‌రెడ్డి తెలిపారు. సమ్మె జరిగితే తమ యూనియన్‌కు చెందిన కార్మికులు విధులకు హాజరవుతారని వెల్లడించారు.

11. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్నది జేఏసీ చైర్మన్‌ వెంకన్న మాట. సమ్మెకు నోటీసు ఇచ్చిన నాయకులను పిలిచి మాట్లాడితే అప్పుడు పునరాలోచిస్తామని అంటున్నారు.

12. గత ప్రభుత్వం ఉద్యోగుల సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేసింది. పైగా సీఎం కార్యాలయానికి మహిళా ఉద్యోగులను పిలిచి మాత్రమే వరాలు ఇచ్చింది. కానీ, విలీనం సమస్యను పెండింగ్‌లో పెట్టి తప్పుకుంది. ఆనాడే విలీనం సమస్య పరిష్కరిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

Related News

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

Big Stories

×