Social Media Security : సోషల్ మీడియా.. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా యువతలో దాదాపు 80 శాతం మంది ప్రతీ రోజూ సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారట. కనీసం రోజులో 3 గంటలు వీటికే కేటాయిస్తున్నారని తెలిసింది. అయితే దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయో, అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ డిజిటల్ యూగంలో సోషల్ మీడియా వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల వల్ల ప్రస్తుతం యువత ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. అయినా కూడా దీని వాడకం నిలిపివేయడం అనేది అసాధ్యం. కాబట్టి కొన్ని పద్ధతులతో ఈ సోషల్ మీడియాను సానుకూలంగా ఉపయోగించొచ్చని అంటున్నారు పలువురు టెక్ నిపుణులు.
సానుకూలంగా ఉండేలా ఎలా వాడాలంటే? –
ముందుగా సోషల్ మీడియా ఉపయోగించే విషయంలో టైమ్ లిమిట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత క్రమంగా సమయాన్ని తగ్గిస్తూ ఉండాలి. దీని వల్ల ఇతర పనులు చేసుకునేందుకు ఇంకాస్త ఎక్కువ సమయం దొరుకుతుంది. అదే విధంగా భవిష్యత్తుపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా వాడకాన్ని బ్రేక్ ఇస్తూ ఉండాలి. దీనినే సోషల్ మీడియా డిటాక్స్ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోషల్ మీడియాపై ఆసక్తి కూడా తగ్గుతుంది. ఇలా చేస్తే సోషల్ మీడియా వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు.
సోషల్ మీడియా దేని కోసం ఉపయోగించాలంటే? –
అలానే జీవితంలో ఎంతగానో ఉపయోగపడే అంశాల గురించి కూడా అవగాహన తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇకపోతే కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఈ సోషల్ మీడియాను ఉపయోగించేలా చేసుకోవాలి. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో కూరుకుపోయి, పక్కవారితో పోలికలు పెట్టుకొని, వాటి గురించి బాధ పడకుండా.. బంధువులు, స్నేహితులతో సంతోషంగా మాట్లాడేందుకు ఈ సోషల్ మీడియాను వినియోగించొచ్చు.
సోషల్ మీడియాలో ఇలా చేస్తే వెరీ డేంజరెస్ –
⦿ ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయకూడదు.
⦿ వీడియోల రూపంలో కూడా పోస్టులు పెట్టకూడదు. ఇలా చేయడం చట్టవిరుద్ధం.
⦿ సోషల్ మీడియాలో కుల, మత వర్గాల మధ్య విభేదాలకు దారి తీసేలా, ద్వేషపూరితమైన ప్రసంగాలను పోస్టులు చేయకూడదు.
⦿ ఇంకా ఉద్దేశపూర్వకంగా రెండు వర్గాల మధ్య విభేదాలకు దారితీసేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలను వ్యాప్తి చేయొద్దు.
⦿ హింసాత్మక వీడియోలు, ఇతరులను బాధించేవి, తప్పుడు సమాచారం వంటి పోస్టులు కూడా పెట్టకూడదు.
⦿ ఆన్లైన్ వేధింపులకు పాల్పడి నగదు వసూలు చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేయకూడదు.
⦿ నకిలీ ఖాతాలను సృష్టించి, వాటి ద్వారా అసభ్యకరమైన పోస్టులు లేదా మెసేజ్లు పెట్టకూడదు.
కాబట్టి సోషల్ మీడియాను వీలైనంత తక్కువగా, అవసరమైన విషయాలకు, జ్ఞానం పెంచుకునేందుకు మాత్రమే వాడితే మంచిది. దీని వల్ల మీకు, మీ వాళ్లకు కూడా ఎటువంటి నష్టం ఉండదు. సోషల్ మీడియాతో చేటు కూడా ఉండదు.
ALSO READ : అయ్యో.. నిలిచిపోయిన సేవలు.. మెటా ఏమంటుందంటే!