Sony LinkBuds Fit: టెక్నాలజీ ప్రియులకి మరో వార్త వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ బ్రాండ్ సోనీ మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ఉత్పత్తితో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి సోనీ తన తాజా TWS (ట్రూ వైర్‌లెస్ స్టీరియో) ఇయర్‌బడ్‌లను “లింక్‌బడ్ ఫిట్” పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా ఆడియో ప్రియుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఈ బడ్స్, మ్యూజిక్, కాలింగ్, కనెక్టివిటీ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నాయి.
3 రంగుల్లో
ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, కావున ఆసక్తి ఉన్నవారు వెంటనే సోనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. నలుపు (Black), ఆకుపచ్చ (Green), తెలుపు (White) రంగుల్లో ఈ బడ్స్ అందుబాటులో ఉన్నాయి.
అదిరిపోయే ఫీచర్లు
ఈ బడ్స్‌లో ఉపయోగించిన ఎయిర్ ఫిట్టింగ్ సపోర్టర్లు మెత్తటి ఇయర్ టిప్స్ వల్ల వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని తక్కువ బరువు, డిజైన్ దీర్ఘకాలం ఉపయోగించే విధంగా ఉండనుంది.
నిష్శబ్ద సంగీతం
లింక్‌బడ్ ఫిట్‌లలో ఉన్న అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వలన చుట్టూ ఉన్న శబ్దాన్ని ఫిల్టర్ చేస్తుంది. దీని ద్వారా మీరు పూర్తిగా మీ మ్యూజిక్ లేదా కాల్‌లో మునిగిపోవచ్చు. అత్యుత్తమ ధ్వని అనుభూతి కోసం ఇందులో DSEE Extreme టెక్నాలజీ (Digital Sound Enhancement Engine) అమలు చేయబడింది. దీని సహాయంతో కంప్రెస్ చేయబడిన ఫైల్స్‌కి కూడా హై-క్వాలిటీ ఫినిషింగ్ అందుతుంది.
క్లియర్ ఆడియో
8.4mm డైనమిక్ డ్రైవర్ X యూనిట్లను కలిగి ఉండే ఈ బడ్స్ హై-రిజల్యూషన్ వైర్‌లెస్ ఆడియోకి మద్దతు ఇస్తాయి. వీటిలో SBC, AAC, LC3, LDAC వంటి ప్రముఖ ఆడియో కోడెక్స్ సపోర్ట్ ఉండటం వల్ల, మీరు ఏది వినిపించినా అద్భుతమైన ధ్వని నాణ్యతను పొందుతారు.
AI టెక్నాలజీతో స్మార్ట్ అనుభూతి
ఈ ఇయర్‌బడ్‌లు సోనీ V2 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తున్నాయి. ఇవి WF-1000XM5 వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లలోనూ ఉపయోగించబడింది. ఈ ప్రాసెసర్ సాయంతో ఆడియో ప్రాసెసింగ్ వేగంగా, ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆటో యాంబియంట్ సౌండ్ మోడ్ ద్వారా మీరు బయట ఉన్నా, గదిలో ఉన్నా పరికరం స్వయంగా శబ్దాన్ని గుర్తించి ఫిల్టర్ చేస్తుంది.
Read Also: LPG Gas: సామాన్యులకు షాకిచ్చిన ప్రభుత్వం..ఎల్పీజీ గ్యాస్ …
మరింత ఈజీగా కాలింగ్ అనుభవం
కాలింగ్ సమయంలో ప్రెసిస్ వాయిస్ పికప్ టెక్నాలజీ వలన, మీ మాటలు స్పష్టంగా వేరుగా గుర్తించబడి, రిసీవర్‌కి క్లీన్‌గా చేరుతాయి. బ్యాక్‌గ్రౌండ్ నోయిజ్ లేకుండా మాట్లాడడం ఈ ఫీచర్‌తో మరింత సులభం అవుతుంది.
3D అనుభూతి
ఈ లింక్‌బడ్ ఫిట్‌లు స్పేషియల్ సౌండ్, హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ అందిస్తాయి. అంటే మీరు వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు, శబ్దం తల తిప్పిన దిశలోకి మారుతుంది. ఇది పూర్తిగా ఒక 3D ధ్వని అనుభూతిని కలిగిస్తుంది.
కనెక్టివిటీ, బ్యాటరీ
బ్లూటూత్ 5.3, మల్టీ-పాయింట్ కనెక్టివిటీతో వస్తుంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 ఆధారంగా పనిచేస్తుండటంతో, ఫాస్ట్, స్టేబుల్ కనెక్షన్ పొందవచ్చు. అంతేకాదు, మల్టీ-పాయింట్ కనెక్టివిటీ వల్ల ఒకేసారి రెండు డివైసులతో కనెక్ట్ చేసి, మనం తేలికగా స్విచ్ చేయవచ్చు.
సోనీ కనెక్ట్ యాప్ ద్వారా పూర్తి నియంత్రణ
సోనీ కనెక్ట్ యాప్ ద్వారా మీరు బాస్ అడ్జస్ట్మెంట్స్, ఇక్వలైజర్ సెట్టింగ్స్, టచ్ కంట్రోల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ లైఫ్
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బడ్స్ 8 గంటలు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 21 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. అతి తక్కువ సమయంలో ఛార్జింగ్ కావడం కూడా దీని ప్రధాన ఆకర్షణ. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్ తో 60 నిమిషాల ప్లేబ్యాక్ పొందవచ్చు.
ధర, ఆఫర్
సోనీ లింక్‌బడ్ ఫిట్ అధికారిక ధర రూ. 24,990 ఉండగా, లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఇయర్‌బడ్‌లను ఇప్పుడు కేవలం రూ.18,990కే లభిస్తున్నాయి. ఇదే కాదు, కొనుగోలు చేసే వినియోగదారులకు సోనీ రూ.5,990 విలువ గల పోర్టబుల్ స్పీకర్ SRS-XB100 ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.