E-Paper
Advertisement

సోనీ కంపెనీ ఫోన్లు తయారు చేయడం ఆపేసిందా? అసలు ట్విస్ట్ తెలిస్తే..

సోనీ కంపెనీ ఫోన్లు తయారు చేయడం ఆపేసిందా? అసలు ట్విస్ట్ తెలిస్తే..
Advertisement

Sony Phones: సోనీ అంటే వెంటనే గుర్తొచ్చేవి ప్లేస్టేషన్, వాక్‌మ్యాన్, టీవీలు. అయితే ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ సోనీకి మంచి గుర్తింపు ఉండేది. Sony Ericsson తర్వాత వచ్చిన Xperia సిరీస్ 2010లలో Samsung, LG ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చింది. అమెరికాలో 2024 నుంచి ఎక్స్‌పీరియా ఫోన్ల విక్రయాలు తగ్గినా.. యూరప్, జపాన్, తైవాన్, హాంకాంగ్ వంటి మార్కెట్లలో సోనీ ఇప్పటికీ తమ ఫోన్లను విక్రయిస్తోంది. అయితే ఇప్పుడు అసలు చర్చ ఏమిటంటే.. సోనీ కంపెనీయే వాటిని తయారు చేస్తోందా? అని.

సోనీ ఫోన్లు తయారీ ఆపేసిందా?

2025లో జపాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ డైజెస్ట్, సోనీ ఫ్యాక్టరీల ఉత్పత్తి వివరాల్లో వచ్చిన మార్పులను గుర్తించింది. గతంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రాలుగా పేర్కొన్న థాయ్‌లాండ్‌లోని రెండు, చైనాలోని ఒక ప్లాంట్ ఆ జాబితా నుంచి తొలగించబడ్డాయి. దీంతో ఎక్స్‌పీరియా ఫోన్ల తయారీపై కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి.

Xperia 1 VIIతో మారిన పరిస్థితి:

Advertisement

అదే సమయంలో సోనీ Xperia 1 VIIను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ నుంచి ఫోన్‌ను థర్డ్ పార్టీ ద్వారా అసెంబుల్ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే 2025 ఆగస్టులో సోనీ CFO లిన్ టావో మాత్రం ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై కంపెనీకి పూర్తి నిబద్ధత ఉందని స్పష్టం చేశారు.

అప్పట్లో Xperia అంటే ప్రత్యేకమే:

ఎక్స్‌పీరియా కాంపాక్ట్ సిరీస్‌లో 5 అంగుళాలు లేదా అంతకంటే చిన్న స్క్రీన్‌తో వచ్చిన ఫోన్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాగే ఎక్స్‌పీరియా ప్రీమియం మోడళ్లలో 4K డిస్‌ప్లేలు అందించి సోనీ కొత్త ట్రెండ్‌కు తెరతీసింది. ప్రపంచంలో 4K డిస్‌ప్లేతో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ కూడా సోనీదే.

ఇప్పుడు ఫోకస్ మారింది:

Advertisement

ఇటీవలి Xperia ఫోన్లు గతంతో పోలిస్తే మరింత సాధారణ డిజైన్, ఫీచర్లతో వస్తున్నాయి. Xperia 1 VIలో 4K డిస్‌ప్లే స్థానంలో 1080p ప్యానెల్‌ను ఉపయోగించడంతో పాటు కెమెరాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఎక్స్‌పీరియా 5 సిరీస్‌ను మాత్రం 2023లో సోనీ నిలిపివేసింది. అయితే కంపెనీ సొంత ఫ్యాక్టరీల్లో ఫోన్ల తయారీ తగ్గినా.. Xperia బ్రాండ్‌ను పూర్తిగా వదిలేసే ఆలోచన కంపెనీకి లేదనే సంకేతాలు ఉన్నాయి.

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×