E-Paper
Advertisement

అమ్మో.. దేశంలో ఒక్క బిడ్డను పెంచడానికి రూ.6.75 కోట్లా? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే!

అమ్మో.. దేశంలో ఒక్క బిడ్డను పెంచడానికి రూ.6.75 కోట్లా? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Child Expenses: దేశంలోని హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో (Metropolitan Cities) జీవించాలంటే ఖర్చులు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఒక బిడ్డను నగరంలో పెంచి పెద్ద చేయాలంటే ఏకంగా రూ.కోట్లు ఖర్చు చేయాల్సిందేనని ప్రముఖ ఫైనాన్స్ అడ్వైజర్, కంటెంట్ క్రియేటర్ ఉదయన్ అధ్యా అంచనా వేశారు. ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకూ వారి అవసరాలు, స్కూల్ – కాలేజీ ఫీజులకు సగటున రూ.6.75 కోట్లు ఖర్చు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దీనిని లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు.

విద్యారంగంలో ద్రవ్యోల్బణం

పిల్లల పెంపకానికి సంబంధించి ఉదయన్ అధ్యా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. అందులో ఆయన వేసిన లెక్కల ప్రకారం.. బిడ్డకు అయ్యే మొత్తం ఖర్చులో అత్యధిక భాగం చదువుకే సరిపోతుంది. ప్రతి సంవత్సరం పాఠశాల ఫీజులు దాదాపు 10% నుండి 12% వరకు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఉదాహరణకు ప్రస్తుతం ఒక డిగ్రీ చదువుకు రూ. 20 లక్షలు ఖర్చవుతుంటే.. అదే చదువుకి మరొక 18 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా ఏకంగా రూ. 1.6 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందన్నారు.

కంటికి కనిపించని రోజువారీ ఖర్చులు

Advertisement

కేవలం ట్యూషన్ ఫీజులే కాకుండా తల్లిదండ్రులు పెద్దగా గుర్తించని అనేక ఖర్చులు ఈ రూ. 6.75 కోట్ల అంచనాలో ఉన్నాయి. ఆటలు, ఈత, సంగీతం వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో పాటు పోటీ పరీక్షల కోచింగ్, హెల్త్‌కేర్, గాడ్జెట్లు, టెక్నాలజీ, ఫ్యామిలీ ట్రిప్పులు, కేర్ ‌టేకర్ల ఖర్చులు ఇందులో భాగమే. మెట్రో నగరాల్లో జీవించే కుటుంబాలకు ఈ ఖర్చులు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ముందుచూపు లేకపోతే ఇబ్బందే!

సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు ప్రస్తుత ధరలను మనసులో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంటారని ఉదయన్ అధ్యా అన్నారు. అయితే భవిష్యత్తులో పెరిగే ధరలను (ద్రవ్యోల్బణం) సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల పొదుపుకు, అసలు ఖర్చుకు మధ్య పెద్ద గ్యాప్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు అవసరాలను ఆర్థిక లక్ష్యాలుగా భావించి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

Advertisement

Also Read: 60 ఏళ్ల వివాదానికి చెక్.. పైగా భూములపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!

వైరల్ అవుతున్న లెక్కలు

ఉదయన్ వీడియో ఇన్స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వడంతో ఈ రూ. 6.75 కోట్ల లెక్క ఎలా వచ్చిందో స్పష్టంగా వివరించాలంటూ నెటిజన్లు కోరారు. దీంతో ఈ లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను గూగుల్ డాక్యుమెంట్ రూపంలో షేర్ చేస్తానని ఆయన తెలిపారు. అయితే నగరాల్లో జీవించే ప్రతి కుటుంబానికి కచ్చితంగా రూ. 6.75 కోట్లు ఖర్చవుతాయని దీని అర్థం కాదని ఆయన పేర్కొన్నారు. నివసించే నగరం, చెల్లించే స్కూలు ఫీజులు, జీవించే లైఫ్ స్టైల్ ను బట్టి ఈ లెక్కలు మారుతుంటాయని స్పష్టం చేశారు. అయితే నానాటికి భారంగా మారుతున్న స్కూల్ ఫీజులు, ద్రవ్యోల్బణం, జీవనశైలి తల్లిదండ్రులు ముందే గుర్తించి.. జాగ్రత్త వహించాలన్నది తన ముఖ్య ఉద్దేశమని ఉదయన్ వివరించారు.

Also Read: మెటా సంచలన నిర్ణయం.. పిల్లలు Facebook, Instagram వాడాలంటే ఇక ఇవి తప్పనిసరి!

Tags

Related News

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

Big Stories

Advertisement
×