Split AC vs Window AC: సమ్మర్ వచ్చిందంటే చాలు, ఎండ వేడి నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు ఏసీలను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తారు. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకి పైగా ఉన్నా, మన ఇంట్లో మాత్రం చల్లదనం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే దీని కోసం అనేక మంది ఏసీలను కొనుగోలు చేయాలని భావిస్తారు. కానీ విండో AC కొంటే సరిపోతుందా? లేక స్ప్లిట్ AC తీసుకుంటే మంచిదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండింటి మధ్య ఎన్నో తేడాలు, ఫీచర్లు, ఖర్చులు, పనితీరు లాంటి విషయాలన్నీ ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో పరిస్థితిలో బెస్ట్ గా పని చేస్తాయి.
మొదటిది టెక్నాలజీ తేడా
విండో AC అనేది ఒకే యూనిట్ సిస్టమ్. అంటే, కూలింగ్ యూనిట్, కంఫ్రెసర్, ఫ్యాన్ all-in-one. దీన్ని విండోలో ఇన్‌స్టాల్ చేయాలి. డిజైన్ సింపుల్, అమర్చడం సులువు, కానీ స్థల పరిమితి అనేది పెద్ద సమస్యగా మారుతుంది. స్ప్లిట్ AC అంటే పేరే చెబుతోంది. ఇది రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఇండోర్ యూనిట్ గదిలో ఉండి చల్లదనాన్ని ఇస్తుంది, అవుట్‌డోర్ యూనిట్ గోడ బయట కంఫ్రెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది అందంగా ఉండటమే కాకుండా, శబ్దం తక్కువగా వస్తుంది.
ఏది కూల్‌గా ఉంటుంది
విండో ACలు చిన్న గదుల కోసం బెస్ట్. కానీ పెద్ద గదులకు ఏ మాత్రం సరిపోవు. స్ప్లిట్ ACలు అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, ఫాస్ట్ కూలింగ్, ఏంగిల్ ఎయిర్ థ్రో వంటి అధునాతన ఫీచర్లతో స్ప్లిట్ ACలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. పెద్ద గది లేదా హాలుకు స్ప్లిట్ AC బెస్ట్. చిన్న గది ఉంటే విండో AC సరిపోతుంది.
విద్యుత్ వినియోగం
విండో ACలు కాస్త ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. అదీ మోనోకంప్రెసర్ ఉంటే, బిల్లు రెట్టింపు కావడం ఖాయం. స్ప్లిట్ ACల్లో ఇప్పుడు చాలా వరకు ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తోంది. దీని వల్ల 40% వరకు విద్యుత్ పొదుపు ఉంటుంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సేపు AC వాడతారంటే స్ప్లిట్ AC బెటర్. బిల్లుల విషయంలో తక్కువగా తింటుంది.
Read Also: Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్.. …
ఖర్చు దేనికి ఎక్కువ?
విండో AC – లోయర్ మింటెనెన్స్. లోకల్ టెక్నీషియన్ కూడా సర్వీస్ చేయగలడు.
స్ప్లిట్ AC – హై మింటెనెన్స్. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం. ఫిల్టర్ క్లీనింగ్, గ్యాస్ రీఫిల్లింగ్ మొదలైనవి ఖచ్చితంగా చూసుకోవాలి.
ఇన్‌స్టాలేషన్ ఖర్చు దేనికి తక్కువ?
విండో AC – సాధారణంగా తక్కువ ఖర్చుతో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒక్క విండో స్పేస్ ఉండడమే సరిపోతుంది.
స్ప్లిట్ AC – ఇండోర్ + అవుట్‌డోర్ యూనిట్ల కోసం వాల్ డ్రిల్లింగ్, పైపింగ్, కార్పెంటరీ వర్క్ అవసరం. ఇన్‌స్టాలేషన్ ఖర్చు ఎక్కువ.
ఏది నెమ్మదిగా పనిచేస్తుంది
విండో AC – గదిలో కంఫ్రెసర్ కూడా ఉండేలా ఉంటుంది కాబట్టి, శబ్దం ఎక్కువ.
స్ప్లిట్ AC – కంఫ్రెసర్ బయట ఉంటుంది కాబట్టి, అతి తక్కువ శబ్దంతో నడుస్తుంది. నిద్రకు శబ్దం డిస్టర్బ్ చేయకూడదంటే స్ప్లిట్ AC ని ఎంచుకోండి.
లుక్ & ఫీల్
విండో AC – సాధారణమైన డిజైన్. పెద్దగా ఇంటీరియర్‌ను మెరుగుపరచదు.
స్ప్లిట్ AC – స్లిమ్, మోడ్రన్, స్టైలిష్. మీ ఇంటీరియర్‌ను హైలైట్ చేస్తుంది. మీరు డిజైన్ ప్రేమికులు అయితే స్ప్లిట్ AC మీకు సరైన ఎంపిక.
ఖర్చుతో పోల్చుకుంటే?
విండో AC – 1 టన్ను మోడల్స్ రూ.20,000 – రూ.28,000 మధ్య ఉంటాయి.
స్ప్లిట్ AC – 1 టన్ను స్ప్లిట్ AC రూ.28,000 – రూ.40,000 లేదా అంతకంటే ఎక్కువ.