E-Paper
Advertisement

కాల్స్ బ్లాక్ చేసి విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

కాల్స్ బ్లాక్ చేసి విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్
Advertisement

Stop unwanted calls:  డైలీ మన ఫోన్‌కు ఎన్నో రకాల కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, లోన్లు, ఇన్సూరెన్స్ అంటూ రోజుకు పదికి పైగా స్పామ్ కాల్స్ వచ్చి మనల్ని తీవ్రంగా విసిగిస్తుంటాయి. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వస్తే చిరాకు పెరుగుతుంది. చాలా మంది ఇలాంటి నంబర్లను ఒక్కొక్కటిగా ‘బ్లాక్’ చేస్తుంటారు. కానీ.. ఎంత బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి మళ్లీ కాల్స్ వస్తూనే ఉంటాయి. అయితే.. నంబర్లను బ్లాక్ చేయకుండానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందంటే.. మీరు నమ్ముతారా? అదేంటో ఇప్పుడు చూద్దాం!

స్పామ్ కాల్స్ సమస్యకు అసలైన చెక్ పెట్టే మార్గం:

గూగుల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. మన ఫోన్‌లలో ఇప్పటికే.. కొన్ని పవర్‌ఫుల్ ఫీచర్లు బిల్ట్-ఇన్‌గా వస్తున్నాయి. వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే.. ఏ ఒక్క నంబర్‌ను మ్యాన్యువల్‌గా బ్లాక్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫోన్ స్వయంగా ఆ స్పామ్ కాల్స్‌ను గుర్తించి సైలెంట్ చేస్తుంది లేదా కట్ చేస్తుంది.

1.గూగుల్ ఫోన్ యాప్‌లో ‘కాలర్ ఐడీ అండ్ స్పామ్’సెట్టింగ్:

Advertisement

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే..మీ ఫోన్ లోని ‘ఫోన్'(Phone)యాప్‌ను ఓపెన్ చేయండి. తర్వాత పైన కనిపించే త్రీ-డాట్స్ (రైట్ సైడ్ కార్నర్) పై క్లిక్ చేసి Settings లోకి వెళ్లండి. అక్కడ Caller ID & Spam లేదా Blocked Numbers ఆప్షన్ కనిపిస్తుంది. అందులో See caller and spam ID, అలాగే Filter spam calls అనే ఆప్షన్లను ఎనేబుల్ (Enable) చేయండి. ఈ సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల కంపెనీల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, మార్కెటింగ్ కాల్స్‌ను గూగుల్ ఆటోమేటిగ్గా గుర్తించి మీ ఫోన్ మోగకుండా ముందే కట్ చేస్తుంది.

Also Read: రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!

2. ట్రూకాలర్ లేదా ఇన్‌బిల్ట్ యాంటీ-స్పామ్ ఫిల్టర్స్:

Advertisement

ఒకవేళ మీరు ట్రూకాలర్ (Truecaller) వాడుతున్నట్లయితే, దాని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Block’ సెక్షన్‌లో Block top spammers ఆప్షన్‌ను ఆన్ చేయండి. దీనివల్ల దేశ వ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ రిపోర్టెడ్ స్పామ్ నంబర్లు అన్నీ ఆటోమేటిక్‌గా బ్లాక్లిస్ట్‌లోకి వెళ్ళిపోతాయి. మీకు ఆ నంబర్ల నుంచి ఎలాంటి రింగింగ్ సౌండ్ రాదు.

3. ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం ‘Silence Unknown Callers’:

మీరు ఐఫోన్ వాడుతుంటే ..ఈ ట్రిక్ మీకు చాలా బాగా పని చేస్తుంది. మీ ఐఫోన్ Settings లోకి వెళ్లండి. కిందకు స్క్రోల్ చేసి Phone ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ Silence Unknown Callers అనే ఫీచర్‌ను ఆన్ చేయండి. ఇది ఆన్ చేయడం వల్ల మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని కొత్త నంబర్ల నుంచి కాల్ వస్తే.. మీ ఫోన్ రింగ్ కాదు. ఆ కాల్ సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లి పోతుంది. ఆ తర్వాత ఆ నంబర్ రియల్ కాల్ కాదా అని చెక్ చేసుకుని మీరు మాట్లాడొచ్చు.

ప్రతి సారీ వచ్చే అజ్ఞాత కాల్స్‌తో చిరాకు పడే బదులు, మీ ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్‌ మార్పులు చేసుకోండి చాలు. ఇది మీ సమయాన్ని,మానసిక ప్రశాంతతను కాపాడుతుంది.

Related News

రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

మూవీ లవర్స్ కోసం క్రేజీ గాడ్జెట్..ఈ ప్రొజెక్టర్ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ !

మొబైల్ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 24 నుంచి కొత్త సిమ్ రూల్స్.. పరిమితి దాటితే అంతే!

కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? అసలు నిజం తెలిస్తే ఎప్పటికీ అలా చేయరు!

రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!

రూ.2వేల బడ్జెట్‌లో ఇంత సౌండ్ మ్యాజికా ? కొత్త ఐక్యూ బడ్స్ చూస్తే అవాక్కవుతారు!

యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్‌స్ట్రక్షన్ కాస్ట్!

Big Stories

Advertisement
×