TCL S5K 50-inch TV: మీ ఇంటి కోసం.. ఒక పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో.. ఇప్పుడు క్యూఎల్ఈడీ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. సాధారణ ఎల్ఈడీ టీవీలతో.. పోలిస్తే క్యూఎల్ఈడీ టీవీలలో కలర్స్ చాలా రిచ్‌గా , బ్రైట్‌గా కనిపిస్తాయి. అయితే.. వీటి ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రముఖ బ్రాండ్ అయిన టీసీఎల్ మాత్రం అందరికీ అందుబాటు ధరలో TCL S5K 126 cm TV మోడల్‌ను లాంచ్ చేసి సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం రూ.29,990 ధర వద్ద లభిస్తున్న ఈ టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ టీవీ మోడల్ 50 ఇంచుల (126 సెం.మీ) భారీ స్క్రీన్‌తో వస్తుంది. దీని మెటాలిక్ బెజెల్-లెస్, స్లిమ్ డిజైన్ టీవీకి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతే కాకుండా.. 100% కలర్ వాల్యూమ్ ప్లస్, క్వాంటం డాట్ టెక్నాలజీ ఉండటం వల్ల ప్రతి ఇమేజ్ చాలా స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తుంది. అలాగే హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉండటం వల్ల చీకటి సీన్లలో కూడా ఇమేజ్ లు చాలా స్పష్టంగా కనిపించి థియేటర్ ఫీల్ కలిగేలా చేస్తాయి.
ఇది కేవలం సాధారణ స్మార్ట్ టీవీ మాత్రమే కాదు. దీని లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. అంతే కాకుండా.. దీని ద్వారా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటం వల్ల మీ మొబైల్ లేదా ట్యాబ్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్ సపోర్ట్ ద్వారా కేవలం మీ గొంతుతోనే టీవీని కంట్రోల్ చేయొచ్చు.
పెద్ద స్క్రీన్‌కు తగ్గట్టుగానే.. ఇందులో పవర్ ఫుల్ ఆడియో సిస్టమ్ ఇచ్చారు. కాబట్టి ఈ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఉన్న స్పీకర్లు ఉంటాయి. ఇవి స్పష్టమైన.. డైలాగ్ డెలివరీని అందించడంతో పాటు, మూవీ చూసేటప్పుడు లేదా మ్యూజిక్ వినేటప్పుడు మంచి సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. గేమింగ్ , స్పోర్ట్స్ లవర్స్ కోసం ప్రత్యేకమైన మోడ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Also Read: ఇదేందయ్యా ఇది..రూ.14 వేలకే 43 ఇంచుల స్మార్ట్ టీవీనా?
ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో ఈ టీవీ ధర సుమారు రూ.29,990 వరకు ఉంది. 50 ఇంచుల సైజులో, క్యూఎల్ ఈడీ డిస్‌ప్లే , గూగుల్ టీవీ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ బడ్జెట్ ధరలో.. బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు గనక తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఫీచర్లు ఉన్న పెద్ద స్మార్ట్ టీవీని కోరుకుంటే మాత్రం ఈ మోడల్ కచ్చితంగా బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
గమనిక: ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో జరిగే సేల్స్, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లను బట్టి ఈ ధరలో మరిన్ని తక్కువ ఆఫర్లు లభించే అవకాశం ఉంది.