E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది..రూ.14 వేలకే 43 ఇంచుల స్మార్ట్ టీవీనా?

ఇదేందయ్యా ఇది..రూ.14 వేలకే 43 ఇంచుల స్మార్ట్ టీవీనా?
Advertisement

VW OptimaX 43 inch QLED TV: ఇంట్లో ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండాలనేది .. అందరి కోరిక. ముఖ్యంగా.. సినిమా థియేటర్ ఫీల్.. ఇంట్లోనే పొందాలని చూసే వారికి క్యూఎల్ఈడీ టెక్నాలజీ బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే క్యూఎల్ఈడీ టీవీలు సాధారణంగా చాలా ఎక్కువ ధర ఉంటాయి. కానీ.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అందిస్తున్న సరి కొత్త ఈ స్మార్ట్ టీవీ మాత్రం కేవలం రూ.14,299 ధరకే.. అందుబాటులోకి వచ్చి ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రస్తుత గూగుల్ అప్‌డేట్‌లు, యూజర్ సర్చ్ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉండే ఈ బడ్జెట్ టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్, డిస్‌ప్లే:

ఈ టీవీ మోడల్ పేరులో.. ఉన్నట్లుగా.. ఇది 43 ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. బెజెల్ లెస్ డిజైన్ దీని ప్రత్యేకత. అంటే.. స్క్రీన్ చుట్టూ అంచులు చాలా సన్నగా ఉండి, మరింత పెద్దదిగా కనిపిస్తుంది. క్యూఎల్ఈడీ టెక్నాలజీ కారణంగా రంగులు చాలా సహజంగా, ప్రకాశ వంతంగా కనిపిస్తాయి. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో.. వస్తున్న ఈ డిస్‌ప్లే..సినిమాలు చూసేటప్పుడు లేదా వీడియో గేమ్స్ ఆడేటప్పుడు.. మంచి విజువల్ ఎక్స్‌ పీరియన్స్‌ను ఇస్తుంది.

2. స్మార్ట్ ఫీచర్లు, పెర్ఫార్మెన్స్:

Advertisement

ఇది కేవలం సాధారణ టీవీ కాదు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో.. పని చేసే.. ఈ స్మార్ట్ టీవీ. దీని ద్వారా మీరు నేరుగా మీ టీవీలోనే నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్, యూ ట్యూబ్ వంటి  ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం.. వల్ల వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా టీవీని ఆపరేట్ చేయొచ్చు. వైఫై కనెక్టివిటీ, యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఇందులో ఉంటాయి.

3. సౌండ్ క్వాలిటీ :

మంచి విజువల్స్‌తో పాటు.. పవర్ పుల్ సౌండ్ కూడా ఉంటేనే.. అసలైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ టీవీలో డీసెంట్ స్పీకర్లు ఇవ్వడం జరిగింది. అందుకే.. సాధారణ గదికి సరి పోయేలా క్లియర్ ఆడియో అందించడంతో.. పాటు, వివిధ సౌండ్ మోడ్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే.. మీకు ఇంకా హై-ఎండ్ హోమ్ థియేటర్ సౌండ్ కావాలంటే .. ఆడియో అవుట్‌ పుట్ పోర్ట్స్ ద్వారా ఎక్స్‌టర్నల్ స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫ్రిజ్..రూ.15వేలలోపు బెస్ట్

4. ధర:

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో ఈ టీవీ ధర రూ.14,299గా ఉంది. రూ.15 వేల బడ్జెట్‌లో సాధారణ ఎల్ఈడీ టీవీలే వస్తుండగా.. అదే ధరలో క్యూఎల్ఈడీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లు దొరకడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం లుక్, అదిరి పోయే డిస్‌ప్లే క్వాలిటీ కోరుకునే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది బెస్ట్ ఆప్షన్.

గమనిక: ఆన్‌లైన్ ఈకామర్స్ ప్లాట్‌ ఫారమ్‌లలో సేల్స్, బ్యాంక్ ఆఫర్లను బట్టి ఈ ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనే ముందు ధరలను ఒక సారి చెక్ చేసుకోండి.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×